యంగ్ హీరో నాగచైతన్య వరుస సినిమా లతో టాలీవుడ్ లో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఇప్పటికే బంగ్గారాజు సినిమా తో చైతూ సూపర్ హిట్ అందుకున్నాడు. అంతే కాకుండా బాలీవుడ్ సినిమా లాల్ సింగ్ చద్దా లో కీలక పాత్రలో నటించాడు.
Advertisement
ఇదిలా ఉంటే విక్రమ్ కే కుమార్ దర్శకత్వం లో థాంక్యూ సినిమా లో కూడా నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేయగా మంచి రెస్పాన్స్ వస్తోంది.
Advertisement
సినిమాలో నాగచైతన్య మూడు లవ్ స్టోరీ లలో కనిపించబోతున్నాడు. ఇక సినిమా విడుదల దగ్గరపడుతున్న నేపథ్యంలో చిత్ర యూనిట్ సినిమా ప్రమోషన్స్ లో ఫుల్ బిజీగా ఉంది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఓ ఇంటర్వ్యూలో నాగచైతన్య పాల్గొన్నారు. కాగా ఈ సినిమా చేస్తున్నప్పుడు మీకు ఏమనిపించిందని ఎలా ఉండబోతుందని యాంకర్ ప్రశ్నించింది. దానికి నాగ చైతన్య సమాధానం ఇస్తూ… ప్రతి సినిమా స్క్రిప్ట్ ను తాను మనసుతో చదువుతానని చెప్పాడు. ఈ సినిమాతో ఒక రిలేషన్ షిప్ ఎంత ముఖ్యమో తనకు అర్థమైందని అన్నాడు.
ప్రతి రిలేషన్ షిప్ జీవితంలో ఏదో ఒక విషయాన్ని నేర్పిస్తుందని అన్నాడు. అంతేకాకుండా జీవితంలోకి వచ్చిన వారు మనకు ఏదో ఒక రకంగా సహాయపడతారని అన్నారు. వాళ్లకు కచ్చితంగా థాంక్యూ చెప్పి తీరాలని అన్నాడు. సినిమా షూటింగ్ దశలో ఉన్నప్పుడే అలా కొంతమందికి థాంక్యూ చెప్పానని చైతు పేర్కొన్నాడు.