Home » బంగార్రాజు స్టేజ్ పై హీరోయిన్ చైతూ క్యూట్ లుక్స్…అక్కినేని కొత్త కోడలు అంటూ ట్రోల్స్…!

బంగార్రాజు స్టేజ్ పై హీరోయిన్ చైతూ క్యూట్ లుక్స్…అక్కినేని కొత్త కోడలు అంటూ ట్రోల్స్…!

by AJAY

ప్రస్తుతం సోషల్ మీడియా ఏ రేంజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సెలబ్రిటీలకు సంబంధించి తేడాగా ఉన్న ఫోటో లేదా వీడియో దొరికిందంటే చాలు క్షణాల్లో వైరల్ అవ్వాల్సిందే. తేడాగా అంటే ఫన్నీగానో లేదా రొమాంటిక్ గానో ఇలా సరికొత్తగా ఉండటం అన్నమాట. అలాంటి స్టఫ్ మీమ్స్ పేజీలకు దొరికందంటే సెకన్లలో వైరల్ అయిపోతుంది. ఇక ఇప్పుడు అలాంటి వీడియో నే ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రీసెంట్ గా నాగరాజున నాగచైతన్య హీరోలుగా నటించిన బంగార్రాజు సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఈవెంట్ కు హీరో హీరోయిన్లు మరియు నటీనటులు హాజరయ్యారు.

ఇదే ఈవెంట్ లో నాగార్జున మాట్లాడుతున్న సమయం లో నాగచైతన్య ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూస్తాడు. అదే సమయంలో చైతూ వెనకాల ఉన్న హీరోయిన్ దీక్ష నగార్కర్ కూడా చైతూ ను చూసింది. అంతే కాకుండా చైతును చూస్తూ రెండు కను బొమ్మలు పైకి ఎగరేసి ఏంటి అన్నట్టుగా ఎక్స్ ప్రెషన్స్ ఇచ్చింది. దాంతో చైతూ సిగ్గుపడుతూ మళ్లీ ముందుకి చూసాడు. ఇక ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

అక్కినేని ఇంటికి మరో కోడలు అంటూ కొంతమంది ట్రోల్స్ చేస్తున్నారు. ఇక మరికొందరు మన్మధుడి కొడుకు అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఇక ఈ వీడియో లో కనిపించిన హీరోయిన్ దీక్ష నగార్కర్ మాత్రం ఒక్క వెడయోతో పాపులర్ అయ్యింది. వీడియో లో ఉన్న హీరోయిన్ పేరు ఎంటా అని తెగ వేతికేస్తున్నారు. నిజానికి దీక్ష ఇప్పటికే హుషారు సినిమాలో నటించి అలరించింది. అంతే కాకుండా జంబి రెడ్డి సినిమాలోనూ నటించి ఆకట్టుకుంది.

https://www.instagram.com/evadra_nuvvuu/tv/CYirgioME_C/?utm_medium=copy_link

Visitors Are Also Reading