Home » నాగబాబు అంత మాట చిరంజీవినే అనేశాడా.. మెగా కాంపౌండ్ లో ఇన్ని వైరాలున్నాయా..?

నాగబాబు అంత మాట చిరంజీవినే అనేశాడా.. మెగా కాంపౌండ్ లో ఇన్ని వైరాలున్నాయా..?

by Sravanthi
Ad

తెలుగు ఇండస్ట్రీలో మెగా బ్రదర్స్ అంటే తెలియనివారుండరు.. మెగాస్టార్ చిరంజీవి, నాగబాబు, పవన్ కళ్యాణ్ ఈ ముగ్గురు స్టార్ బ్రదర్స్ తెలుగు ఇండస్ట్రీ లోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా మంచి పేరు సంపాదించుకున్న వారే.. ఇందులో నాగబాబు ఇప్పటి వరకు ఎవరితో కూడా శత్రుత్వం పెట్టుకోని వ్యక్తిగా పేరుపొందారు.. కానీ ఈ మధ్య కాలంలో ఆయన కొన్ని ఆసక్తికరమైన పోస్ట్ లు పెడుతూ అందరిని ఆశ్చర్య పరుస్తున్నారు.. ఈ మధ్యకాలంలో నాగబాబు ఆయన తమ్ముడు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీలో చాలా క్రియాశీలకమైన పాత్ర పోషిస్తున్నారు.. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా నాగబాబు యాక్టివ్ గా ఉంటూ ఏపీ రాజకీయాలపై ఎప్పటికప్పుడు స్పందిస్తూనే ఉన్నారు.. ఈ విధంగా ఈ మధ్య కాలంలో ఆయన చేస్తున్న ట్వీట్స్ వైరల్ గా మారుతున్నాయి.. మెగా కాంపౌండ్ లో బ్రదర్స్ మధ్య కాస్త వైరం ఉన్నట్లు ఈ ట్విట్స్ చూసిన అభిమానులు అంటున్నారు.

Advertisement

ఆరెంజ్ మూవీ నిర్మాతగా చేసి చాలావరకు లాస్ అయిన నాగబాబును అప్పట్లో చిరంజీవి ఆదుకో లేదనే వాదన కూడా వినిపించింది. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ ఆర్థిక సాయం చేసినట్టు నాగబాబు కొన్ని సందర్భాల్లో తెలిపారు.. అన్నా చిరంజీవి వారికి లైఫ్ ఇచ్చాడు అనే కృతజ్ఞత భావం లోపల ఉన్నా కానీ మెగాస్టార్ పై కాస్త నెగిటివ్ ఫీలింగ్ తమ్ముళ్లలో ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం నాగబాబు, పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉన్న సమయంలో, వారి రాజకీయ ప్రత్యర్దులయిన వారితో చిరంజీవి చాలా సన్నిహితంగా ఉండడం వీరికి నచ్చడం లేదట.. చిరంజీవి జగన్ తో కలిసి చాలా వేదికలపై కూర్చుంటున్నారు.. ఇది కాస్త జనసేన వర్గాలకు ఇబ్బంది కలిగిస్తోందని తెలుస్తోంది.. దీంతో గత వారం రోజుల నుండి నాగబాబు సోషల్ మీడియా వేదికగా పలు సంచలన పోస్టులను పెడుతున్నారు.. అదేంటంటే..

Advertisement

” నీ అంత తేలిగ్గా ఎవ్వరినీ వదులుకోను.. వదులుకున్నాను అంటే వాడికన్నా వెధవ ఈ ప్రపంచంలో ఉండడు అంటూ ” ఒక పోస్టు పెట్టాడు.. ఇది ఆయన సన్నిహితులను ఉద్దేశించి చేసిందే అని స్పష్టంగా అర్థం అవుతోంది.. తాజాగా మరో పోస్టు పెట్టాడు. ” మంచివాడు శత్రువులకు కూడా సాయం అందిస్తాడు.. కానీ చెడ్డవారైతే తోడబుట్టిన వాళ్లను కూడా ముంచేస్తారు.. మంచి వాళ్ళను దూరం చేసుకుంటే.. మనల్ని ముంచే వాళ్లే దగ్గర అవుతారని ” సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.. ఈ పోస్టు నిశితంగా గమనిస్తే మాత్రం జనసేన పార్టీకి దూరంగా ఉంటున్న మెగాస్టార్ ను ఉద్దేశించి నాగబాబు కామెంట్ చేసారని చాలా మంది అభిప్రాయపడుతున్నారు.. మరి ఇందులో ఎంత వరకు నిజమో అబద్దమో ఉందో తెలియదు కానీ .. ఈ విధంగా నాగబాబు పెట్టిన ట్విట్స్ మాత్రం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి..

ALSO READ;

Visitors Are Also Reading