ఒకప్పుడు సెలబ్రెటీలు పెద్దగా ఫిట్నెస్ కు ప్రాధాన్యత ఇచ్చేవారు కాదు. హీరోలు సైతం పొట్టలు వేసుకుని కనిపించేవారు. కానీ ఇప్పుడు కాలం మారింది. హీరోల నుండి తండ్రి పాత్రలు చేసేవాళ్ల వరకూ ప్రతిఒక్కరూ ఫిట్నెస్ కు ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నారు. జిమ్ లో కసరత్తులు చేస్తూ ఫిట్నెస్ కోసం ఎంతో కష్టపడుతున్నారు. ఇదిలా ఉండగా తాజాగా నాగబాబు జిమ్ లో కసరత్తులు చేస్తున్న వీడియో ఒకటి వైరల్ అవుతోంది.
Advertisement
నాగబాబు తన మేనల్లుడు యంగ్ హీరో వైష్ణవ్ తేజ్ తో కలిసి జిమ్ లో వర్కౌట్ చేస్తున్నాడు. వీడియోలో నాగబాబు వైష్ణవ్ తేజ్ డంబెల్స్ పట్టుకుని కసరత్తులు చేస్తున్నారు. ఇక ఈ వీడియోను సోషల్ మీడియోలో షేర్ చేసిన నాగబాబు కొత్త జిమ్ పార్టనర్ దొరికాడు అంటూ క్యాప్షన్ ఇచ్చాడు. ఇక వైష్ణవ్ తేజ్ కూడా ఇదే వీడియోను షేర్ చేసి మామతో జిమ్ అంటూ పేర్కొన్నారు.
Advertisement
ఇదిలా ఉండగా వీరిద్దరి కెరీర్ విషయానికి వస్తే నాగబాబు ప్రస్తుతం కామెడీ షోలకు జడ్జిగా వ్యవహరిస్తున్నారు. అంతే కాకుండా అప్పుడప్పుడు సినిమాల్లోనే మెరుస్తూ ఉంటారు. రీసెంట్ గా నాగబాబు బంగార్రాజు సినిమాలో నాగబాబు యముడి పాత్రలో నటించారు. ఇక వైష్ణవ్ తేజ్ విషయానికి వస్తే ఉప్పెన సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి సూపర్ డూపర్ హిట్ అందుకున్నారు. ఈ సినిమా తరవాత వైష్ణవ్ తేజ్ కొండపొలం సినిమాతో ప్రేక్షకుల మధ్యకు వచ్చాడు. ఈ సినిమా ఫ్లాప్ గా నిలిచింది. ఇక ప్రస్తుతం పలు క్రేజీ చిత్రాల్లో నటిస్తున్నారు.