మెగాస్టార్ చిరంజీవి దసరా పండుగ సంధర్బంగా గవర్నర్ దత్తాత్రేయ హైదరాబాద్ లో నిర్వహించిన అలాయ్ బలాయ్ కార్యక్రమానికి అతిధిలా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో సినిమా రాజకీయ ప్రముఖులతో పాటూ ఇతరులు కూడా హాజరయ్యారు. ఇదే కార్యక్రమానికి ప్రవచనకర్త గరికపాటి కూడా హాజరయ్యారు. అయితే కార్యక్రమం జరుగుతుండగా గరికపాటి ప్రసంగంలో బిజీగా ఉన్నారు. ఇక అదే సమయానికి చిరంజీవిని చూసిన ఆనందంలో కార్యక్రమానికి వచ్చిన కొంతమంది మహిళలు సెల్ఫీలు దిగారు.
Advertisement
హీరోలు అంటే ఎవరైనా ఫోటోలు దిగడానికి ఆసక్తి చూపిస్తారు. అక్కడుంది మెగాస్టార్ ఎవరు మాత్రం చూస్తూ ఉండిపోతారు. వెంటనే ఫోన్ లు పట్టుకుని సెల్ఫీలు దిగడం ప్రారంభించారు. అయితే ఆ సమయంలో ప్రసంగిస్తున్న గరికపాటికి కోపం వచ్చింది. చిరంజీవి గారూ మీరు ఫోటోలు దిగటం ఆపేస్తే నేను మాట్లాడతాను లేదంటే వెళ్లిపోతాను అంటూ సీరియస్ గా అన్నారు.
Advertisement
ఇక ఫోటోల సెషన్ ఆపేయడంతో పాటూ చిరంజీవి వచ్చి తాను గరికపాటి అభిమాని అంటూ చెప్పుకున్నారు. ఇదంతా బానే ఉంది కానీ చిరు పై గరికపాటి ఫైర్ అంటూ వార్తలు వచ్చాయి. మరోవైపు నాగబాబు ట్విట్టర్ లో గరికపాటి పై సెటైర్ వేస్తూ కామెంట్స్ చేశారు. ఇక గరికపాటి తాను కోప్పడటం పై క్షమాణలు చెప్పారు.
కాగా నాగబాబు కూడా యూటర్న్ తీసుకున్నారు. తాజాగా మరో ట్వీట్ లో నాగబాబు గరికపాటి గారు ఏ మూడ్ లో అలా అన్నారో కానీ ఆయన లాంటి పండితులు అలా అనకూడదని అలా అన్నామే తప్ప ఆయన క్షమాపణలు చెప్పాలని కాదు. మెగా అభిమానులు ఆయనను తప్పుగా అర్థం చేసుకోవద్దని రిక్వెస్ట్ అంటూ ట్వీట్ లో నాగబాబు పేర్కొన్నారు.