Home » చిరంజీవిపై నాగబాబు కోపంతో ఉన్నాడా..? ఆ కామెంట్ల వెన‌క అర్థమేంటి..?

చిరంజీవిపై నాగబాబు కోపంతో ఉన్నాడా..? ఆ కామెంట్ల వెన‌క అర్థమేంటి..?

by AJAY
Ad

మెగాస్టార్ చిరంజీవి ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా సినిమా ఇండ‌స్ట్రీలో స్టార్ హీరో అయ్యారు. తన న‌ట‌నను టాలెంట్ ను మాత్ర‌మే నమ్ముకుని చిరు సినిమా ఇండ‌స్ట్రీలో స‌క్సెస్ అయ్యారు. చిరంజీవి హీరోగా ఎదిగిన త‌ర‌వాత త‌న త‌మ్ముళ్లు నాగ‌బాబు, ప‌వ‌న్ క‌ల్యాణ్ ల‌ను సైతం హీరోల‌ను చేశాడు. నాగ‌బాబు స్టార్ హీరోగా ఎద‌గ‌న‌ప్ప‌టికీ బుల్లితెర స్టార్ అయ్యాడు. ఇక ప‌వ‌న్ టాలీవుడ్ లో స్టార్ హీరోగా రానిస్తున్నాడు.

Advertisement

అంతే కాకుండా జ‌న‌సేన పార్టీని స్థాపించి ఏపీ రాజ‌కీయాల్లో కీల‌కంగా వ్య‌వ‌హ‌రిస్తున్నాడు. నాగ‌బాబు కూడా జ‌న‌సేన పార్టి బాధ్య‌త‌ల‌ను చూసుకుంటూ జ‌నసేన‌లో కీల‌కంగా మారారు. అయితే ఇప్పుడు ఇదే మెగాబ్ర‌ద‌ర్స్ మ‌ధ్య చిచ్చుకు దారితీసింది అనే వార్త‌లు టాలీవుడ్ లో గుప్పుమంటున్నాయి. ప‌వ‌న్, నాగ‌బాబులు జ‌న‌సేన‌ను బ‌లోపేతం చేయాల‌ని చూస్తుంటే చిరంజీవి మాత్రం ఏపీ సీఎం జ‌గ‌న్ తో స‌న్నిహితంగా ఉంటున్నారు.

Advertisement

అంతే కాకుండా సంధర్భం వ‌చ్చిన‌ప్పుడ‌ల్లా జ‌గ‌న్ పై ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు. రాజ‌కీయాల ప‌రంగా ప‌వ‌న్ క‌ల్యాణ్ కు ఎక్క‌డా స‌పోర్ట్ ఇచ్చిన‌ట్టుగా క‌నిపించ‌డం లేదు. దాంతో జ‌న‌సైనికులు సోష‌ల్ మీడియాలో చిరంజీవి పై ఫైర్ అవుతున్నారు. చిరు వ‌ల్లే ప‌వ‌న్ పొటిక‌ల్ గా ఎద‌గ‌లేక‌పోతున్నార‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. ఇదిలా ఉండ‌గా ఇప్పుడు నాగ‌బాబు, ప‌వ‌న్ క‌ల్యాణ్ లు కూడా చిరుపై గుర్రుగా ఉన్నారంటూ వార్త‌లు వినిపిస్తున్నాయి.

ముఖ్యంగా నాగబాబు సోష‌ల్ మీడియాలో చేస్తున్న పోస్ట్ లు చిరును ఉద్దేశించే అంటూ నెటిజ‌న్లు అభిప్రాయ‌ప‌డుతున్నారు. నాగ‌బాబు ఓ పోస్ట్ లో మంచివాడు శ‌త్రువుల‌కు కూడా సాయం చేస్తాడు. చెడ్డ‌వాడు తోడ‌బుట్టిన‌వాళ్ల‌ను కూడా ముంచుతాడు. మంచివాళ్ల‌ను దూరం చేసుకుంటే ముంచేవాళ్లే ద‌గ్గ‌ర‌వుతారు అంటూ పేర్కొన్నారు. ఇక ఈ పోస్ట్ కు నెటిజ‌న్లు నాగ‌బాబు చిరును ఉద్దేశించే ఈ కామెంట్స్ చేస్తున్నాడ‌ని అభిప్రాయ‌ప‌డుతున్నారు.

Visitors Are Also Reading