అలనాటి హీరోలలో ఎన్టీఆర్, ఏఎన్నార్, శోభన్ బాబు మంచి గుర్తింపు పొందారు.. ఆ తర్వాత వీరి వారసులుగా ఎంతోమంది హీరోలు ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా ఎదిగారు. అలా అక్కినేని నాగేశ్వరరావు వారసుడుగా నాగార్జున ఇండస్ట్రీలో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఇక నాగార్జున వారసులుగా అక్కినేని కుటుంబం నుంచి నాగచైతన్య, మరియు అఖిల్ మూడవ తరం హీరోలుగా కొనసాగుతున్నారు. కానీ అక్కినేని వంశం నుంచి ఈ మూడవ తరం హీరోలైన నాగచైతన్య జోష్ చిత్రంతో ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చినప్పటికీ ఆ సినిమా పరాజయం పాలైంది.
also read:పవన్ కళ్యాణ్ కరాటే లో బ్లాక్ బెల్ట్ అని మీకు తెలుసా..?
Advertisement
ఆ తర్వాత వచ్చిన ఏం మాయ చేసావే సినిమా ఘన విజయం అందుకుంది. అప్పటివరకు కాస్త క్లాస్ సినిమాలు చేసిన నాగచైతన్య మాస్ హీరోగా ఎదగాలనే ప్రయత్నంలో చేసిన చిత్రాలన్ని డిజాస్టర్ గా నిలిచాయి. ఈ సమయంలో నాగార్జున తన ఎక్స్పీరియన్స్ తో నాగచైతన్యకు సెట్ అయ్యే క్లాస్ సినిమాలు చేయమని చెప్పి ఉంటే నాగచైతన్య కెరియర్ ఇప్పుడు మరోలా ఉండేది. ఇప్పటికే ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎదిగే వారు . కనీసం లవర్ బాయ్ గా అయినా మిగిలి ఉండేవారు అంటూ కొంతమంది అభిప్రాయం.
Advertisement
also read:ఈ చిరంజీవి హీరోయిన్ ని గుర్తుపట్టారా.. ఇప్పుడు వేలాది కోట్లకు అధిపతి..!!
ఆయనకు ఇలాంటి సూచనలు నాగార్జున ఇవ్వకపోవడంతో అటు క్లాస్ హీరోగా ఇటు మాస్ హీరోగా కాకుండా పోయారట. ఇప్పుడిప్పుడే కొన్ని సినిమాలతో హిట్స్ అందుకున్నప్పటికీ ఆయన స్టార్ హీరోగా మాత్రం నిలబడలేక పోతున్నారని చెప్పవచ్చు. ప్రస్తుతం ఆయన వెంకట్ ప్రభు దర్శకత్వంలో ఒక సినిమాను చేస్తున్నారు. ఇది కనుక విజయవంతం అయితే నాగచైతన్య సినీ కెరియర్ ఇండస్ట్రీలో కొనసాగుతుందని చెప్పవచ్చు..
also read:పవన్ కళ్యాణ్ కరాటే లో బ్లాక్ బెల్ట్ అని మీకు తెలుసా..?