Home » ఇండస్ట్రీ పెద్దలంతా రిస్క్ అన్నారు.. కానీ నాగ్ హిట్ కొట్టి నోర్లు మూయించారు.. సినిమా ఏంటంటే..!!

ఇండస్ట్రీ పెద్దలంతా రిస్క్ అన్నారు.. కానీ నాగ్ హిట్ కొట్టి నోర్లు మూయించారు.. సినిమా ఏంటంటే..!!

by Sravanthi Pandrala Pandrala
Ad

నాగార్జున డబల్ యాక్షన్ లో నటించిన సినిమాల్లో ఈ మూవీ చాలా హిట్ అయ్యింది. కానీ ఆ సినిమా వెనక చాలా పెద్ద కథ ఉంది. ఆ మూవీ ఏంటో తెలుసుకుందామా..!! నాగార్జున ద్విముఖ పాత్రలో నటించి ఎంతోమంది ప్రేక్షకుల ఆదరణ పొందిన చిత్రం హలో బ్రదర్. మూవీ ఇప్పటికి 28 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. శ్రీ దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై వచ్చిన ఈ మూవీకి ఇవివి సత్యనారాయణ దర్శకత్వం వహించారు. నాగార్జునకు జోడీగా రమ్యకృష్ణ మరియు సౌందర్య హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకి రాజ్ కోటి సంగీతం అందించారు. 1994వ సంవత్సరం ఏప్రిల్ 20వ తేదీన ఈ మూవీ విడుదలైంది. ఎవరు ఊహించనంత బ్లాక్ బాస్టర్ అందుకుంది. ఈ మూవీ

Advertisement

వచ్చి 28 సంవత్సరాలు పూర్తి కావస్తున్న ఈ సందర్భంగా దాని గురించి కొన్ని ఆసక్తికరమైన సంఘటనలు తెలుసుకుందాం..! హలో బ్రదర్ సినిమా హాంగ్ కాంగ్ యాక్షన్ కామెడీ డ్రామా స్ఫూర్తితో నిర్మించారు. ఈ మూవీ కంటే ముందు నాగార్జునతో ఈవివి వారసుడు అనే సినిమా చేశాడు. ఈ మూవీ కూడా చాలా హిట్ అయింది. కాకపోతే కొంత క్రెడిట్ సూపర్ స్టార్ కృష్ణ అకౌంట్ లో పడింది. నాగార్జునతో రెండవ మూవీ అనుకున్నప్పుడు మొదటగా హలో బ్రదర్ చేద్దాం అనుకోలేదట ఇవివి. ఆయనతో మంచి ఫ్యామిలీ డ్రామా చిత్రాన్ని చేద్దాం అనుకున్నారట. కానీ నాగార్జున అప్పటికే లవ్ స్టోరీ సినిమాలు ఎన్నో చేశారు. ఈవి వి గారు అప్పటికే కామెడీ సినిమాలు

Advertisement

తీయడంలో దిట్ట. వీరి కాంబినేషన్లో యాక్షన్ మూవీస్ వచ్చాయి. దీంతో ఆయన కొత్త కాన్సెప్ట్ లో చేయాలని భావించి ట్విన్స్ కాన్సెప్ట్ తీసుకున్నారు. అప్పటివరకు రాజేంద్రప్రసాద్ తో మాత్రమే సినిమాలు చేసుకుంటూ వచ్చిన ఈవివి గారికి మంచి అవకాశం ఇచ్చిన స్టార్ హీరో నాగార్జున. ఆయనతో సినిమా చేసేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలని అనుకున్నారు. హీరో కవలలుగా పుట్టడం, తర్వాత వెంటనే వారు వేరు పడడం ఒకరు గొప్పవారిగా మరొకరు పేదవారిగా మారడం అనేది ఒక ఇందులో ప్రధానంగా చూపించారు. ఈ మూవీకి రెండు నెలల ముందు మెగాస్టార్ రౌడీ

అల్లుడు సినిమా రావడం అది కూడా ఇంచుమించు ఎలాంటి కథే. కాబట్టి హలో బ్రదర్ సినిమా చర్చల దశలో ఉండగానే ఎన్నో విమర్శలు కూడా వచ్చాయి. నాగార్జునకి చాలామంది ఫోన్లు చేసి ఈ ప్రాజెక్టు చేయకండి అని చెప్పారట. నాగార్జున తండ్రి ఏఎన్నార్ కూడా అలా చెప్పిన వారిలో ఒకరిగా ఉన్నారు. కానీ నాగార్జునలో ఏదో తెలియని కాన్ఫిడెన్స్ ఆ సినిమా వైపు నడిపించింది. ఎన్నో అనుమానాల మధ్య సినిమా రిలీజ్ అయి ఫస్టు సీన్ దగ్గరనుంచి చివరి సీన్ వరకు జనాలు సినిమాను ఎంతో ఆస్వాదించారు. నాగార్జున డబల్ రోల్ ఎంతో మందిని ఆకట్టుకుంది. దీంతో సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది.

ALSO READ;

Jabardasth : సుధీర్ చేసిన ప‌నికి ఫీల్ అయిన ర‌ష్మీ.. రోజా వార్నింగ్‌..!

మ్యాగీ తింటున్నారా.. అయితే ఈ విషయం తెలుసుకోండి..!!

 

Visitors Are Also Reading