Naa Saami Ranga Trailer : అక్కినేని నాగార్జున గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అక్కినేని నాగేశ్వరరావు వారసత్వాన్ని అందుపుచ్చుకొని ఇండస్ట్రీలో రాణిస్తున్నారు నాగార్జున. ఆయన వయసు పైబడినప్పటికీ కూడా యంగ్ హీరోలకు పోటీగా సినిమాలు చేస్తున్నారు అక్కినేని నాగార్జున. సినిమాలు చేయడమే కాకుండా బిగ్బాస్ లాంటి పెద్ద షోలకు హోస్ట్ గా కూడా వ్యవహరిస్తున్నారు అక్కినేని నాగార్జున.
అటు ఏడాదికి మూడు సినిమాల చొప్పున చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఇక ప్రస్తుతం నా సామి రంగ సినిమా చేస్తున్నారు అక్కినేని నాగార్జున. యంగ్ దర్శకులు విజయ్ పిన్ని ఈ సినిమాను తీశారు. ఇందులో ఊర మాస్ లుక్ లో అక్కినేని నాగార్జున కనిపించనున్నారు. అంతేకాదు నా సామిరంగా సినిమాలో ఆశికా రంగనాథ్ హీరోయిన్ గా నటిస్తుండగా అల్లరి నరేష్ మరియు రాజు తరుణ్ లు కీలక పాత్రలు పోషిస్తున్నారు.
Advertisement
అయితే అక్కినేని నాగార్జున ప్రతి సంక్రాంతికి ఒక సినిమాతో వస్తారు. ఇప్పుడు నా సామి రంగ సినిమాతో సంక్రాంతి ముందు సందడి చేయనున్నారు.జనవరి 14వ తేదీన ఈ మూవీ థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ క్రమంలో ఈ సినిమా ట్రైలర్ వచ్చేసింది. నా స్వామి రంగా ట్రైలర్ ను మూవీ టీం నేడు జనవరి 9న రిలీజ్ చేసింది. మాస్ లుక్ తో రౌడీలను నాగార్జున చితకొట్టే సీన్ తో ‘నా సామిరంగ’ ట్రైలర్ షురూ అయింది. ‘కిష్టయ్య ను కొట్టే మగాడు ఎవడైనా ఉన్నాడా అసలు’ అంటూ అల్లరి నరేష్ వాయిస్ ఓవర్ తో ఓపెన్ అయింది. హీరోయిన్ ఆషికా రంగనాథ్ తో కింగ్ నాగార్జున కెమిస్ట్రీ బాగా కుదిరింది.
Advertisement
మరిన్ని తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి