ప్రస్తతం ఇండియాలో దేశ రాజకీయాలు కాకుండా.. మన దేశ క్రికెట్ బోర్డు అయిన బీసీసీఐ యొక్క రాజకీయాల గురించి ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు అనేది తెలిసిందే. అయితే గత మూడేళ్ళుగా బీసీసీఐ బాస్ గా చెలామణి అయిన సౌరవ్ గంగూలీ.. మరో మూడేళ్లు కూడా ఆ పదవిలో ఉండాలి అని అనుకున్నారు. కానీ సమయానికి.. బోర్డులోని పెద్దలు అందరూ దాదాకు ఎదురు తిరిగారు.
Advertisement
దాంతో గంగూలీ మళ్ళీ ఆ పదవి కోసం కనీసం నమోనేషన్ కూడా వేయలేదు. అయితే గంగూలీని ఆయా పదవి నుండి తప్పించాలని.. బోర్డు పెద్దలను అందరిని దాదాకు ఎదురు తిరిగేలా చేసిన చెన్నై సూపర్ కింగ్స్ అధినేత ఎన్.శ్రీనివాసన్ అని తెలుస్తుంది. ఈయనే కావాలని… బోర్డు పెద్దలను గంగూలీకి శ్రీనివాసన్ వ్యతిరేకం చేసాడు అని తెలుస్తుంది. ఇక దీని వెనుక పెద్ద కారణమే ఉంది తెలుస్తుంది.
Advertisement
అదేంటంటే.. ఎన్.శ్రీనివాసన్ కూడా గతంలో బీసీసీఐ ప్రెసిడెంట్ గా చేసాడు. ఇక ఆయన తర్వాత 2019 లో తన సన్నిహితుడు అయిన బ్రిజేష్ పటేల్‌ను ను బీసీసీఐ బాస్ చేయాలనీ ఆయన అనుకున్నాడు. కానీ అప్పుడు గంగూలీ.. చివర్లో అందరిని తన వైపు తిప్పుకొని బీసీసీఐ బాస్ అయ్యాడు. అందువల్ల అప్పటి నుండి గంగూలీ పైన సీరియస్ గా ఉన్న ఎన్.శ్రీనివాసన్.. ఇప్పుడు అవకాశం అనేది దొరకడంతో.. గంగూలీని వ్యతిరేకంగా అందరిని చేసి.. మళ్ళీ ఆ పదవిలోకి రాకుండా చేసాడు అని తెలుస్తుంది.
ఇవి కూడా చదవండి :