సినిమా ఇండస్ట్రీలో ఎంత పెద్ద స్టార్ అయినా ఏదో ఒక సమయంలో బ్యాడ్ టైం వచ్చి ఇబ్బంది పడాల్సిందే. అలాగే బ్యాడ్ టైం వచ్చినప్పుడు వరుసగా సినిమాలు ఫ్లాప్ అవుతుంటాయి. అలాంటి సమయంలో ఓ దర్శకుడు వచ్చి హిట్ ఇచ్చాడు అంటే బ్యాడ్ టైం నుండి గట్టెక్కుతారు. లేదంటే పరిస్థితి అంతే…. కాగా ప్రస్తుతం టాలీవుడ్ లో స్టార్ హీరోలు రానిస్తున్న చిరంజీవి పవన్ కళ్యాణ్ కూడా ఒకప్పుడు బ్యాడ్ టైం తో ఇబ్బంది పడ్డారు. అయితే వీరిద్దరిని కూడా ఒకే దర్శకుడు గట్టెక్కించడం చెప్పుకోదగ్గ విషయం.
Advertisement
ఆ దర్శకుడు ఎవరు చిరు పవన్ చిరు పవన్ లతో ఏ సినిమాలు తీశాడు అనేది ఇప్పుడు చూద్దాం….. మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కిన మెకానిక్ అల్లుడు, బిగ్ బాస్, రిక్షావోడు సినిమాలు వరుసగా ఫ్లాప్ అయ్యాయి. దాంతో చిరంజీవి సంవత్సరం పాటు సినిమాలకు దూరంగా ఉన్నాడు. అయితే ఆ తర్వాత 1997లో హిట్లర్ అనే సినిమాతో మళ్లీ బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. ఈ సినిమాకు ముత్యాల సుబ్బయ్య దర్శకత్వం వహించారు. ఈ సినిమాను ఎమ్ ఎల్ మూవీ ఆర్ట్స్ పతాకంపై ఎం వి లక్ష్మి నిర్మించారు. ఈ సినిమాలో చిరంజీవి రంభ హీరో హీరోయిన్లుగా నటించారు.
Advertisement
ఇక ఈ సినిమా 42 కేంద్రాలలో 100 రోజులు ఆడి రికార్డులు క్రియేట్ చేసింది. ఈ సినిమా మలయాళంలో సూపర్ హిట్ గా నిలిచిన ఓ చిత్రానికి రీమేక్ గా వచ్చింది. మలయాళంలో మమ్ముట్టి శోభన జంటగా నటించగా అక్కడ కూడా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. దాంతో అదే కథతో ముత్యాల సుబ్బయ్య చిరంజీవిని హీరోగా పెట్టి హిట్లర్ లాంటి బ్లాక్ బస్టర్ తెరకెక్కించారు. ఆ తర్వాత చిరు మళ్ళీ వెనక్కి చూసుకోలేదు. ఇక పవన్ కళ్యాణ్ విషయానికి వస్తే అక్కడ అమ్మాయి… ఇక్కడ అబ్బాయి సినిమా తో ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు.
1996లో వచ్చిన ఈ ప్రేమ కథ చిత్రం అనుకున్న మేర విజయం సాధించలేకపోయింది. ఈ సినిమాకు ఈవివి సత్యనారాయణ దర్శకత్వం వహించారు. సినిమాలో పవన్ కళ్యాణ్ సుప్రియా నాయిక హీరో హీరోయిన్లుగా నటించారు. అయితే ఈ సినిమా అనుకున్న మేర విజయం సాధించకపోవడంతో పవన్ కళ్యాణ్ మొదటి సినిమాతోనే నిరాశ చెందాడు. ఇక ఆ తర్వాత ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ గోకులంలో సీత అనే సినిమాలో నటించారు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ కు రాశి జోడీగా నటించగా ఈ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ వరుస ఆఫర్లతో బిజీ అయిపోయాడు.