రిలేషన్ షిప్ అంటే చాలా రకాలుగా ఉంటుంది. ప్రేమించడం…పెళ్లిచేసుకోవడం..డేటింగ్ లో ఉండటం ఇలా ప్రతి బంధాన్ని కూడా రిలేషన్ షిప్ అనే చెబుతాం. అయితే ఏ రిలేషన్ షిప్ లోకి వెళ్లాలి అన్నా కూడా కూడా ఆచితూచి అడుగువేయాల్సి ఉంటుంది. రీసెంట్ గా తనతో డేటింగ్ లో ఉన్న ప్రియురాలు పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తీసుకువచ్చింది అనే కారణంతో దుర్మార్గుడు దారుణంగా హతమార్చాడు.
Advertisement
కాబట్టి ఏ రిలేషన్ షిప్ లోకి వెళ్లాలి అనుకున్నా పార్ట్నర్ గుడ్డిగా నమ్మకూడదు. ముఖ్యంగా ఈ 5 విషయాలు తెలుసుకోవాలని మానసిక నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు చూద్దాం….మీ పార్ట్నర్ అబద్దాలు చెబుతున్నారా లేదంటే నిజాలు మాట్లాడుతున్నారా అన్న విషయాన్ని పసిగట్టాలని సూచిస్తున్నారు. అబద్దాలు చెప్పేవారితో చాలా జాగ్రత్తగా ఉండాలని మానసిక నిపుణులు చెబుతున్నారు.
Advertisement
అయితే చిన్న చిన్న విషయాలకు అబద్దం చెబుతున్నారా లేదంటే ముఖ్యమైన విషయాలలో కూడా అబద్దం చెబుతున్నారా అనే విషయాన్ని తెలుసుకోవాలని సూచిస్తున్నారు. మీ అభిరుచులను..మీ ఆలోచనలను ఇష్టపడేవారితో రిలేషన్ షిప్ లో ఉండటం మంచిదని మానసిక నిపుణులు చెబుతున్నారు. అలాంటి వారితో చాలా సంతోషంగా జీవితం సాగిపోతుందని సూచిస్తున్నారు.
భవిష్యత్ విషయంలో సీరియస్ గా ఉంటే వారితో రిలేషిప్ లో ఉండాలని చెబుతున్నారు. భవిష్యత్ విషయంలో ఎలాంటి సీరియస్ నెస్ లేని వారితో రిలేషన్ షిప్ లో ఉంటే వారి వల్ల సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయిన చెబుతున్నారు. మద్దతుగా ఉండేవారితో రిలేషన్ షిప్ అందంగా ఉంటుందని అలాంటి వారు ఎలాంటి సమయంలోనూ మీ చేయి విడిచిపెట్టరని మానసిక నిపుణులు సూచిస్తున్నారు.