ఏదైనా వేడుక, లేదా పార్టీ లేదా సరదాగా బయటకు వెళ్లాలంటే కూడా ఆడవారు ముందుగానే రెడీ అవడం మొదలు పెడతారు. సహజంగానే ఆడవారికి అలంకరణపై శ్రద్ద ఉంటుంది. అలాగే.. దుస్తులు, జ్యువెలరీ, మేక్ అప్, ఇలా ఆడవారు రెడీ అవడానికి కొంచం ఎక్కువ సమయమే పడుతుంది. కానీ, ఇంట్లో ఉన్నప్పుడు? ఇవన్నీ పక్కన పెట్టేసి సింపుల్ గా ఒక నైట్ డ్రెస్ లేదా నైటీ వేసుకుని గడిపేస్తూ ఉంటారు ఆడవారు.
Advertisement
ఇంట్లో పనులు ఎక్కువగా ఉండడం వల్లో.. లేక ఇతర కారణాల వలనో రెడీ అవడానికి కుదరకపోవచ్చు. దీనితో చాలా మంది ఆడవారు ఇంట్లో ఉన్నప్పుడు సౌకర్యం కోసం నైటీలనే ఆశ్రయిస్తారు. అయితే.. ఇంట్లో ఎక్కువగా నైటీలు వేసుకునే ఆడవారు కొన్ని విషయాలను కచ్చితంగా తెలుసుకోవాలి. ఒకప్పుడు ఇంట్లో ఉండే వారు అయినా సరే కేవలం చీరలు మాత్రమే కట్టేవారు. ఇవి శరీరంలో కొన్ని ప్రాంతాలను పట్టి ఉంచుతాయి. ఫలితంగా ఆభాగాలలో కొవ్వు పేరుకోకుండా ఉండేది.
Advertisement
అయితే.. సౌకర్యం కోసం చాలా మంది వదులుగా ఉండే నైటీలను వేసుకుంటున్నారు. దీనివలన శరీరంలో కొవ్వు పేరుకుపోతూ ఉంటుంది. దుస్తులు వదులుగా ఉండడం వలన శరీరంలోని అన్ని భాగాల వద్ద కొవ్వు పేరుకుపోతూ ఉంటుంది. చీర కట్టుకునే వారి ఆకృతి చక్కగా ఉంటుంది. అదే నైటీలు వేసుకోవడం వలన వారి ఆకృతి మారిపోతూ ఉంటుంది. కాబట్టి ఎక్కువ సమయం నైటీలు వేసుకుని ఉండేవారు ఈ విషయాలను గమనించుకోవడం అవసరం.
బాలకృష్ణ డేట్స్ కోసం ఆ స్టార్ డైరెక్టర్ ఎదురుచూస్తున్నాడా ?