Home » శని అంటే కేవలం కష్టాలేనా..? శని గురించి భయపడేవారు ఈ విషయాలను తప్పక తెలుసుకోవాలి..!

శని అంటే కేవలం కష్టాలేనా..? శని గురించి భయపడేవారు ఈ విషయాలను తప్పక తెలుసుకోవాలి..!

by Sravanthi

శని అనే పదం వింటే చాలా మంది భయపడతారు. జ్యోతిష్య శాస్త్రాన్ని నమ్మని వాళ్ళు కూడా శని అంటే భయపడిపోతారు. అనుకున్నది అనుకున్నట్లు జరగకపోయినా కూడా ఏమైనా ఇబ్బందులు ఎదురవుతాయేమో అని చాలా మంది చెప్తూ ఉంటారు. జాతకంలో శని బాలేదని లక్షల రూపాయలు ఖర్చు చేసే వాళ్ళు కూడా ఉంటారు. శని అశుభం అని చాలా మంది భావిస్తారు. అసలు శని అంటే కష్టాలైనా..? శని దేవుడు వ్యక్తుల్ని కేవలం కష్ట పెడతాడా అనే విషయాలని ఇప్పుడు తెలుసుకుందాం. శని నెమ్మదిగా కదిలే గ్రహం.

దాదాపు రెండున్నర ఏళ్ళు పాటు ఒకే రాశిలో శని ఉంటాడు. శని ఏ రాశిలో ఉంటాడో దానిపై ప్రభావం పడుతుంది. దీనిని ఏలిన నాటి శని అని అంటారు. శని చంద్రుని ప్రభావం చంద్రుని ముందు వెనుక రాశులు ఉన్నప్పుడు శనీశ్వరుని ఏడున్నర ఏళ్ల సంచారం మొదలవుతుంది. వ్యక్తి జీవితాన్ని గణనీయంగా ఇది ప్రభావితం చేస్తుంది. ఏడున్నర ఏళ్ళు ప్రయాణం చేసినప్పుడు కంటికి రెప్పలా శని చూసుకుంటాడు.

Also read:

ఈ సమయంలో శని దేవుడు మీ రాశిలోకి వస్తే మీరు హాయిగా ఉండొచ్చు. మిమ్మల్ని బాగా అర్థం చేసుకుంటాడు. మీ రాశిని బ్రహ్మాండంగా చూసుకుంటాడు. మీకు ఎలాంటి కష్టాలు ఉండవు. హాయిగా ఉండొచ్చు. ఎవరైనా మిమ్మల్ని మోసం చేస్తే కూడా న్యాయం చేస్తాడు. మీరు మీ హక్కులని పొందడానికి సహాయం అవుతుంది. కొంతమంది పేదలు కూడా శని కారణంగా హఠాత్తుగా కోటీశ్వరులు అవుతారు.

తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading