Home » లక్షద్వీప్ వెళ్లాలని అనుకుంటున్నారా..? అయితే లక్షద్వీప్ ప్రత్యేకతలు మొదలు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు ఇవే..!

లక్షద్వీప్ వెళ్లాలని అనుకుంటున్నారా..? అయితే లక్షద్వీప్ ప్రత్యేకతలు మొదలు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు ఇవే..!

by Sravya
Published: Last Updated on
Ad

నరేంద్ర మోడీ లక్షద్వీప్ కి వెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేసినప్పటి నుండి కూడా లక్షద్వీప్ మీద పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. లక్షద్వీప్ గురించి సెర్చ్ చేస్తున్న వారి సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. కేవలం శుక్రవారం ఒక్కరోజే 50 వేల మంది లక్షద్వీప్ గురించి గూగుల్ లో వెతికారు. గత 20 ఏళ్ల లో ఇదే అత్యధికమని కేంద్ర ప్రభుత్వం డిజిటల్ విభాగం చెప్తోంది ఎక్కువగా సెలబ్రిటీలు డబ్బులు బాగా ఉన్నవాళ్లు తరచుగా మాల్దీవ్స్ వెళుతూ ఉంటారు. పూర్తిగా పర్యటకం పైనే మాల్దీవులు ఆధారపడి ఉంది.

lakshwadeep

Advertisement

అక్కడకి ఎక్కువ మంది భారతీయులే వెళ్తుంటారు. అయితే అక్కడ మాల్దీవుల్లో కొత్తగా ఏర్పాటు అయిన ప్రభుత్వం చైనా ట్రాక్లో పడింది కొంతకాలంగా భారత్ కి వ్యతిరేకంగా ఉంటోంది. ప్రధాని నరేంద్ర మోడీ లక్షద్వీప్ పర్యటనతో సీన్ మొత్తం మారింది మాల్దీవుల పర్యటన కోసం బుక్ చేసుకునే వాళ్ళందరూ కూడా క్యాన్సిల్ చేసుకుంటున్నారు. దీని గురించి వెతుకుతున్నారు. లక్షద్వీప్ లో సుందరమైన బీచ్లు, చల్లని గాలులు, ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది. నీలిరంగు సముద్ర జలాలు పర్యటకుల్ని బాగా ఆకట్టుకుంటాయి.

Advertisement

అరేబియా సముద్రంలో ఉండే లక్షద్వీప 36 దీవుల సముదాయం. 1956లో ఈ దేవుని కేంద్రపాలిత ప్రాంతంగా గుర్తించడం జరిగింది 1973లో ఈ దీవులకి లక్షద్వీపని పేరు పెట్టారు. దానికి ముందు దీని పేరుని లక్క ద్వీవ్ అని పిలిచేవారు. 36 దీవులు ఉన్న వాటిలో కేవలం 10 దీవులు మాత్రమే మానవ నివాసయోగ్యంగా ఉన్నాయి. ట్రావెల్ చేయడానికి ఇష్టపడే వాళ్ళు లక్షద్వీపులకి కూడా వెళ్తుంటారు. లక్షద్వీప్ చేరుకోవడానికి కాస్త ఖర్చు ఎక్కువ అవుతుంది. ఇక్కడ ఉష్ణోగ్రత కాస్త ఎక్కువే ఉంటుంది. అయినా సరే పర్యటక ప్రాంతాలని చూడడానికి ఇష్టపడే వాళ్ళు. ఇక్కడికి వెళ్లడానికి ఇష్టపడతారు. మార్చి నుండి జూన్ మధ్య కూడా వెళుతూ ఉంటారు. లక్షద్వీప్ వెళ్లడానికి సెప్టెంబర్ నుండి అనువైన సమయం.

తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading