ప్రతిఒక్కరి జీవితంలో రెండు పార్ట్ లు ఉంటాయి. అందులో ఒకటి పెళ్లికి ముందు జీవితం అయితే రెండోది పెళ్లి తరవాత జీవితం. పెళ్లికి మందు జీవితంలో ఎలా సెటిల్ అవ్వాలి ఏం చదవాలి. ఎలాంటి ఉద్యోగంలో స్థిరపడాలి అన్నది ఉంటుంది. జీవితంలో స్థిరపడిన తరవాత ఎవరిని పెళ్లి చేసుకోవాలి..వాళ్లతో జీవితాన్నిఎలా గడపాలన్నదే ఉంటుంది. పాతికేళ్ల వయసులో పెళ్లి చేసుకుంటే మిగితా జీవితం మొత్తం పెళ్లి తరవాత ఉండబోయేదే. కాబట్టి పెళ్లి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని చెబుతారు.
Advertisement
ఎలాంటి వారిని పెళ్లి చేసుకుంటున్నారు అన్నదానిపైనే మిగతా జీవితం మొత్తం ఆధారపడి ఉంటుంది. కాబట్టి మన పెద్దలు పెళ్లి చేసుకునేటప్పుడు అటు ఏడు తవరాలు ఇటు ఏడు తరాలు చూసుకుని ఆ తరవాతనే చేసుకోవాలని చెప్పేవారు. అలా చెప్పడం వెనక ఒక బలమైన కారణం కూడా ఉంది. అదేంటో ఇప్పుడు చూద్దాం….అటు ఏడు తరవాలు ఇటు ఏడు తరాలు చూడాలంటే…వారి అలవాట్ల గురించి తెలుసుకోవడం.
Advertisement
వారి మానసిక శారిరక ఆరోగ్యాల గురించి తెలుసుకోవడం లాంటివి చేయాలని చెప్పారు. అంతే కాకుండా వారు ఇతరులతో ఏవిధంగా ప్రవర్తిస్తారు. వారి స్వభావం ఎలా ఉంటుంది లాంటివి కూడా తెలుసుకోవాలని చెప్పారు. కానీ ప్రస్తుతం ఏడు తరాల గురించి తెలుసుకుంటే అసలు పెళ్లయ్యే అవకాశాలు కూడా కనిపించడం లేదు.
కాబట్టి ఒక్క తరం గురించి అయితే కచ్చితంగా తెలుసుకోవాలని మానసిక నిపుణులు చెబుతున్నారు. వారి కుంటుంబ నేపథ్యం ఎలాంటిది. పెళ్లి చేసుకునే అబ్బాయి లేదా అమ్మాయి మంచివారేనా..? చెడు అలవాట్లు ఏమైనా ఉన్నాయా ఇలా ప్రతి అంశం గురించి అన్ని తెలుసుకున్న తరవాతనే పెళ్లి చేయాలని చెబుతున్నారు.