Home » ఉదయ్ కిరణ్ ను చిరంజీవి ఫ్యామిలీలో కలుపుకుందాం అనుకున్నాడు – మురళీమోహన్

ఉదయ్ కిరణ్ ను చిరంజీవి ఫ్యామిలీలో కలుపుకుందాం అనుకున్నాడు – మురళీమోహన్

by Bunty
Ad

టాలీవుడ్ ప్రేక్షకుల మదిని దోచుకున్న హీరోలలో ఉదయ్ కిరణ్ ఒకరు. చిత్రం అనే సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైన ఉదయ్ కిరణ్ వరుస హిట్లతో స్టార్ హీరో రేంజ్ కు ఎదిగాడు. ముఖ్యంగా అమ్మాయిల డ్రీమ్ బాయ్ గా ఉదయ్ కిరణ్ పేరు సంపాదించుకున్నాడు. అయితే కొన్ని అనివార్య కారణాలవల్ల ఆత్మ** చేసుకున్నాడు.

Advertisement

ఇది ఇలా ఉండగా తాజాగా ఒక ఇంటర్వ్యూలో భాగంగా సీనియర్ నటులు, నిర్మాత మురళీమోహన్… ఉదయ్ కిరణ్ కు చిరంజీవికి మధ్య ఉన్న సంబంధం పై సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఉదయ్ కిరణ్ చిత్ర పరిశ్రమలకు వచ్చిన అతి తక్కువ సమయంలోనే స్టార్డం సంపాదించుకున్నారని వివరించారు. అయితే ఉదయ్ కిరణ్ కు హైపర్ టెన్షన్ ఎక్కువ… ఒక్కోసారి విపరీతమైన బిపి వస్తుంది… ఆ సమయంలో ఆయన తన కంట్రోల్ లో ఉండరు. ఇకపోతే ఇండస్ట్రీలో చిరంజీవి ఎవరైనా ఒక హిట్ సినిమాలో నటిస్తే వారికి ఫోన్లు చేసి అభినందించడం ఆయన లక్షణం.

Advertisement


ఈ క్రమంలో అప్పట్లో ఉదయ్ కిరణ్ మంచి సినిమాలు చేయడంతో తరచూ ఉదయ్ కిరణ్ ను అభినందించడమే కాకుండా ఆయనను తన ఇంటి అల్లుడుగా చేసుకోవాలని కూడా భావించారని మురళీమోహన్ చెప్పారు. ఈ సందర్భంలోనే అందుకు సంబంధించిన ప్రకటన వెలువడమే కాకుండా తన కూతురితో… నిశ్చితార్థం కూడా జరిపించారు అని తెలిపారు. అయితే ఏమైందో తెలియదు కానీ ఆ నిశ్చితార్థం క్యాన్సిల్ అవ్వడమే, కాకుండా ఉదయ్ కిరణ్ ఆత్మ*** చేసుకున్నారేమోనని మురళీమోహన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

read also : ‘రామ బాణం’ తరహాలో పాత మూవీ టైటిల్స్‌తో వచ్చిన తెలుగు మూవీస్..

Visitors Are Also Reading