దేశంలోనే అతి పెద్ద కార్పొరేట్ సంస్థలలో ఒకటైన రిలయన్స్ గ్రూపులోకి మరొక తరం ఎంట్రీ అయింది. ప్రపంచంలోనే సంపన్న వ్యాపారవేత్తల్లో ఒకరైన ముఖేష్ అంబానీ దేశంలోనే అతి పెద్ద కార్పొరేట్ సంస్థ రిలయన్స్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ గా ఉన్న విషయం తెలిసిందే. తాజాగా జియో టెలికాం పదవీకి ముఖేష్ అంబానీ రాజీనామా చేసారు. ఇక ముఖేష్ అంబానీ పెద్ద కుమారుడు ఆకాశ్ అంబానీ రిలయన్స్ ఇండస్ట్రీస్ యొక్క డిజిటల్ విభాగమైన జియో ఇన్ఫోకామ్ బోర్డు చైర్మన్ గా బాధ్యతలను స్వీకరించనున్నారు.
దాదాపు రూ.16 లక్షల కోట్లకు పైగా విలువగల వ్యాపార సామ్రాజ్యాన్ని తదుపరి కాలానికి అప్పగించే ప్రక్రియ వేగవంతం అయినట్టు తెలుస్తోంది. రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ లిమిటెడ్ స్టాక్ ఎక్సేంజ్ లకు ఈ సమాచారాన్ని ఇవాళ అందించింది. జూన్ 27న మార్కెట్ ను మూసివేసిన తరువాత ముకేశ్ అంబానీ చెల్లుబాటు అవుతుందని కంపెనీ వెల్లడించింది. నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆకాష్ అంబానిని చైర్మన్ గా నియమించేందుకు కంపెనీ డైరెక్టర్ల బోర్డు ఆమోదం తెలిపింది. అదేవిధంగా అదనపు డైరెక్టర్లుగా రవీందర్ సింగ్ గుజ్రాల్, కె.వి చౌదరి నియామకానికి బోర్డు ఆమోదం తెలిపింది. వీరిద్దరూ ఐదు సంవత్సరాల కాలం పాటు స్వతంత్ర డైరెక్టర్లుగా నియమితులయ్యారు.
Advertisement
Advertisement
అలాగే రిలయన్స్ జియో మేనేజింగ్ డైరెక్టర్ పంకజ్ మోహన్ పవార్ నియామకానికి బోర్డు ఆమోదం తెలిపింది. ఈ నియామకాలు వాటాదారులచే మాత్రం ఆమోదించబడలేదు. నియమించబడిన వారు 2022 జూన్ 27 నుంచి ఐదేళ్లపాటు అదనపు డైరెక్టర్లుగా కొనసాగుతారు. మంగళవారం రిలయన్స్ షేర్లు 1.49 శాతం పుంజుకొని రూ.2,529 వద్ద ముగిశాయి. రిలయన్స్ వ్యవస్థాపకుడు ధీరుభాయి అంబానీ మరణించిన తర్వాత సోదరుడు అనిల్ అంబానీ లాగా వాటాల పంపిణీకి తన కొడుకులు కూతుళ్ల మధ్య వివాదం తలెత్తకుండా ముకేశ్ అంబానీ ముందుచూపుతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు స్పష్టమవుతోంది.
Also Read :
ఎన్టీఆర్ చనిపోయినప్పుడు లక్ష్మీ పార్వతి దర్జాగా కూర్చుని అలా చేశారు…వైరల్ అవుతున్న నటి కామెంట్స్…!