నా పేరు ముఖేష్, నేను ఒకే సంవత్సరం గుట్కా నమిలాను, ఇప్పుడు నాకు నోటి క్యాన్సర్ ఆపరేషన్ జరుగుతుంది. బహుషా నేను మాట్లాడలేకపోవొచ్చు. ఇది ప్రతి సినిమాకు ముందు మనం వినే ముఖేష్ స్టోరి. ఇంతకీ ఈ ముఖేష్ ఎవరు? ఆయన వీడియోను సినిమాకు ముందు ఎందుకు ప్లే చేస్తున్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
Advertisement
ముఖేష్ ది మహారాష్ట్రలోని భుసావల్ అనే చిన్న పట్టణం. రోజువారీ కూలీ తన సంపాదన పైనే కుటుంబం నడిచేది. అలాంటి ముఖేష్ కు స్నేహితుల ద్వారా గుట్కా నమలడం అలవాటైంది. అతని పరిస్థితిని వీడియో తీసుకోవడానికి అనుమతి తీసుకున్నప్పుడు అతడు ఎక్కువగా మాట్లాడలేకపోయాడు. ” గుట్కా తినడాన్ని విడిచిపెట్టినందుకు మా అమ్మ నన్ను కొట్టింది, కానీ నేను ఆమె సలహాను పట్టించుకోలేదని అమాయకంగా అన్నాడు. చిన్నవయస్సు, అమాయక ముఖం ఉన్న ముఖేష్ ద్వారా గుట్కా నమలొద్దనే విషయాన్ని ప్రేక్షకులకు మరింత సున్నితంగా చెప్పేలా ఉంటుందనే ఉద్దేశంతోనే ముఖేష్ యాడ్ ను చిత్రీకరించారు. 2009లో ముఖేష్ మరణించాడు.
Advertisement
2012లో, నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ టుబాకో ఎరాడికేషన్ అన్ని సినిమా థియేటర్లలో “ముఖేష్” యాడ్ ఫిల్మ్‌ను ప్రదర్శించడాన్ని తప్పనిసరి చేసింది, ఇది అక్టోబర్ 2013 వరకు నడిచింది. తన సోదరుడి హోర్డింగ్ చూసినప్పుడళ్లా కళ్లలో నీళ్లు తిరుగుతాయంది ముఖేష్ సోదరి. అయితే ఇదే విషయంపై ముఖేష్ అన్న మంగేష్ మాత్రం భిన్నంగా స్పందించాడు. ఓ రేడియో ఛానెల్లో ఇంటర్వ్యూ ఇస్తూ ముఖేష్‌కు క్యాన్సర్ లేదని, ఆహార నాళిక ఇన్ఫెక్షన్ ఉందని, ఆ ప్రకటన కోసం డబ్బులు కూడా చెల్లించలేదని చెప్పాడు.
WHO ప్రకారం, పొగాకు వాడకం వల్ల ఏటా 6 మిలియన్ల మంది మరణిస్తున్నారు. ప్రజల్లో అవగాహన కల్పించేందుకు, పొగాకు వినియోగాన్ని తగ్గించేందుకు వీలుగా ఈ వీడియోను థియేటర్లలో ప్రదర్శిస్తున్నారు.