టాలీవుడ్ టాప్ కమెడిన్ లలో ఎంఎస్ నారాయణ ఒకరు. ఎంఎస్ బ్రహ్మానందం తరవాత ఇండస్ట్రీలో మళ్లీ అంతటి గుర్తింపు తెచ్చుకున్నారు. సొంతం, దూకుడు సహా పలు చిత్రాలలో ఎమ్ ఎస్ నారాయణ తన నటనతో నవ్వులు పూయించారు. ఇప్పటికీ ఆయన చేసిన కామెడీ వీడియోలను ప్రజలు చూసి నవ్వుకుంటూ ఉంటారు. అయితే ఎంతో క్రేజ్ ఉన్న ఎంఎస్ నారాయణ నట వారసులుగా ఆయన కుమారుడు విక్రమ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. కానీ విక్రమ్ ప్రస్తుతం సినిమాలు చేయడంలేదు.
ALSO READ : తగ్గేదె లే….బాలయ్య టాక్ షో మరో రికార్డు…!
Advertisement
అయితే ఆయన ఇండస్ట్రీకి ఎందుకు దూరం అయ్యారు. ప్రస్తుతం ఏం చేస్తున్నారు అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. ప్రస్తుతం విక్రమ్ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. అంతే కాకుండా హైకోర్టు లాయర్ గా కూడా విక్రమ్ పనిచేస్తున్నారు. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో విక్రమ్ మాట్లాడుతూ…తాను ఇండస్ట్రీలో చిన్న చిన్న పాత్రలు కూడా చేశానని చెప్పారు. కేవలం హీరోగానే చేస్తానని తాను ఎప్పుడూ చెప్పలేదని చిన్న పాత్రల్లో కూడా నటించానని చెప్పారు.
Advertisement
తన చేతుల్లో ఏమీ లేదని తన మొదటి సినిమాకు తన తండ్రి ఎమ్ ఎస్ నారయణ దర్శకత్వం వహించారని చెప్పారు. ఒక కమెడియన్ యాక్షన్ సినిమా చేయడం ఏంటని అన్నారని చెప్పారు. ఇక తాను ఇతర సినిమాల దర్శకుల వద్దకు సినిమా అవకాశాల కోసం వెళ్లినప్పుడు కమెడియన్ కొడుకులను రిసీవ్ చేసుకోరు అంటూ కామెంట్లు చేసేవారని తెలిపారు.
తనకు ఆఫర్ లు ఇవ్వడానికి ఎవరూ ఆసక్తి చూపించలేదని చెప్పారు. బ్రాగ్రౌండ్ ఉంటే సినిమా అవకాశాలు రావడం సులభం అనుకుంటారని కానీ అది అంత సులభం కాదని చెప్పారు. తనకు లెజండరీ కమెడియన్ కొడుకుగా గుర్తింపు ఉందని అలా ఓ స్టాంప్ ఉన్నవాళ్లు ఇండస్ట్రీలో ఎదగటం అంత సులభం కాదని విక్రమ్ వ్యాఖ్యానించారు.