Home » Dhoni-Rai Lakshmi : లక్ష్మి రాయ్ ని ధోని వాడుకుని వదిలేసాడా ?

Dhoni-Rai Lakshmi : లక్ష్మి రాయ్ ని ధోని వాడుకుని వదిలేసాడా ?

by Bunty
Ad

నటి మరియు ఐటమ్ డాన్సర్ లక్ష్మీరాయ్ గురించి తెలియని వారుండరు. లక్ష్మీరాయ్1989లో కర్ణాటకలోని బెల్గామ్ లో జన్మించింది. లక్ష్మీ రాయ్ కి చిన్నప్పటినుండే డాన్స్ పై మక్కువ ఉండడంతో డాన్స్ క్లాసులో చేరింది. ఈమె బెల్గాం లోని ఒక స్కూల్లో చదువుతూ అందులో కొన్ని కల్చర్ ఆక్టివిటీస్ లో పాల్గొంటూ ఉండేది. అయితే స్కూలు లోని ఒక కల్చర్ ప్రోగ్రాం కి విచ్చేసిన పద్మిని తన యాక్టింగ్ మరియు లుక్స్ ని చూసి మెచ్చుకుంది. ఇక లక్ష్మీ రాయ్ మొదటగా విజయ్ మూవీలో సెకండ్ హీరోయిన్ గా నటించింది.

Advertisement

దీనితోపాటు తెలుగులో కాంచనమాల కేబుల్ టీవీ సినిమాలో శ్రీకాంత్ కలిసి నటించింది. ఇవి రెండు కూడా ఫ్లాప్ గా మిగిలాయి. ఇలా 2005 నుంచి 2008 వరకు 12 సినిమాల్లో నటించిన కూడా అవి ఫ్లాప్ అయ్యాయి. ఇలాంటి సమయంలోనే కేరళకు వెళ్లి అక్కడ మూవీస్ తీయడంతో ఆమెకు పలువురుతో మంచి సంబంధాలు ఏర్పడ్డాయి. లక్ష్మీ రాయ్ క్రికెటర్ శ్రీశాంత్ ను ఒక అవార్డు ఫంక్షన్లో కలవడంతో వారి మధ్య స్నేహం ఏర్పడి అది కాస్త డేటింగ్ వరకు వెళ్ళింది. ఇలా శ్రీశాంత్ సహాయంతో చెన్నై సూపర్ కింగ్స్ కు బ్రాండ్ అంబాసిడర్ గా మారింది.

ఇది ఇలా ఉండగా క్రికెటర్ ధోని కూడా సీఎస్కే ఆర్గనైజ్ చేసిన ఈవెంట్లో లక్ష్మి రాయ్ కి పరిచయం అయ్యాడు. ఫస్ట్ మీటింగ్ లోనే వీరిద్దరూ క్లోజ్ అయి డాన్స్ చేస్తున్న దృశ్యాలు అప్పట్లో వైరల్ అయ్యాయి. దీంతో వీరిద్దరి పెళ్లి చేసుకోబోతున్నారు అని మీడియాలో చాలా వార్తలు వచ్చాయి. లక్ష్మి రాయ్ సినిమాలు మానేస్తే పెళ్లి చేసుకుంటానని ధోని కండీషన్ పెట్టాడట. దీనికి లక్ష్మీరాయ్ ఒప్పుకోలేదట. ఈ తరుణంలోనే వీరిద్దరూ విడిపోయారు.

Advertisement

మరిన్ని తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!

Visitors Are Also Reading