చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులకు బిగ్ షాక్ తగిలింది. చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని మోకాలి గాయంతో బాధపడుతున్నాడని ఆ జట్టు కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ చెప్పాడు. ధోని గాయం పెద్దదేమి కాదని అతడు కోలుకొని జట్టును నడిపించగలడని విశ్వాసం వ్యక్తం చేశాడు. “రాజస్థాన్ రాయల్స్ తో మ్యాచ్లో ధోని కదలికల్లో ఇబ్బందిని గమనించే ఉంటారు.
READ ALSO : Shaakuntalam review : శాకుంతలం రివ్యూ.. సమంత ఖాతాలో భారీ డిజాస్టర్ ?
Advertisement
అతడు మోకాలి గాయంతో బాధపడుతున్నాడు. ఫిట్నెస్ విషయంలో జాగ్రత్తగా ఉంటాడు. అతడు కోలుకొని తిరిగి జట్టును నడిపించగలడనే విశ్వాసం ఉంది” అని ఫ్లెమింగ్ అన్నాడు. మరోవైపు చెన్నైకి ఇంకో దెబ్బ తగిలింది. ఆ జట్టు పెసర్ సిసాండా మగాల గాయంతో రెండు వారాలు టోర్నీకి దూరమయ్యాడు. రాయల్స్ తో మ్యాచ్ లో రెండే ఓవర్లు వేసిన మగాలా చేతికి గాయం కావడంతో పెవిలియన్ కు వెళ్ళిపోయాడు. అయితే.. ధోనికి గాయం తీవ్రం అయితే.. ఐపీఎల్ 2023 కు పూర్తిగా దూరం అవుతాడని అంటున్నారు. దీనిపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.
Advertisement
read also : ఆ ఒక్క సినిమాతో సిల్క్ స్మిత అప్పుల పాలయ్యారా? తాను చేసిన అప్పులు ఎవరు చెల్లించారంటే?
కాగా..రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ ఓటమి పాలైనప్పటికీ ఆ జట్టు కెప్టెన్ ఎమ్మెస్ ధోని మాత్రం అభిమానులను అలరించారు. తలైవా ట్రేడ్ మార్క్ షాట్లకు చెపాక్ మైదానం దద్దరిల్లిపోయింది.ధోని ఆఖరి వరకు క్రిజులో ఉన్నప్పటికీ తన జట్టు ను గెలిపించలేకపోయాడు. చివరి ఓవర్ లో సీఎస్కే 21 పరుగులు అవసరం అవ్వగా, ధోని రెండు సిక్స్ లు బాధినప్పటికీ విజయం మాత్రం రాజస్థాన్ వైపే నిలిచింది. ఈ మ్యాచ్ లో కేవలం 17 బంతులు మాత్రమే ఎదుర్కొన్న మిస్టర్ కూల్ ఒక్క ఫోర్ మూడు సిక్సర్లతో 32 పరుగులు చేసి అజేయంగా నిలిచారు.
READ ALSO : Chiranjeevi : చిరంజీవి మామూలోడు కాదు… మోజు పడిన మూడు రాత్రుల్లకే!