Home » MS DHONI : హుక్కా తాగుతూ దొరికిపోయిన ధోనీ….ఇదేం పద్ధతి అంటూ ఫైర్ !

MS DHONI : హుక్కా తాగుతూ దొరికిపోయిన ధోనీ….ఇదేం పద్ధతి అంటూ ఫైర్ !

by Bunty
Ad

 

అంతర్జాతీయ క్రికెట్ నుంచి దూరమైన తర్వాత కెప్టెన్ కూల్ మహేంద్రసింగ్ ధోని ఐపీఎల్ మరియు యాడ్ షూట్స్ లో తప్ప పెద్దగా బయట ఎక్కడా కనిపించడం లేదు. అయితే ఇప్పుడు ధోనీపై విమర్శలు వస్తున్నాయి. దానికి గల కారణం ఓ వీడియోలో ధోని హుక్కా కొడుతూ కనిపించాడు. దీంతో ఇది చూసిన ధోని అభిమానులు తెగ షాక్ అవుతున్నారు. ఇన్నాళ్లు చూసిన ధోని వేరు… ఇప్పుడు చూస్తున్న ధోని వేరు అని ధోనీని చాలామంది విమర్శిస్తున్నారు.

MS Dhoni Hookah Smoking Viral Video

Advertisement

అయితే ఇది యాడ్ షూటా? లేకపోతే ధోని నిజంగానే హుక్కా కొడుతున్నాడా అని అభిమానులు షాక్ అవుతున్నారు. అయితే దీనిపై ఆరా తీయగా…. ఇదంతా ఓ యాడ్ షూట్ లో భాగమని, అందులో భాగంగానే ధోని హుక్కా తాగుతూ యాక్ట్ చేశాడని ధోని అభిమానులు చెబుతున్నారు. నిజంగానే ఈ మధ్యకాలంలో ధోని ఓ యాడ్ షూట్ చేశాడు.

ఓ వాచ్ బ్రాండ్ కోసం హిందీ ర్యాప్ సింగర్ స్టాన్ తో కలిసి ధోని ఓ యాడ్ చేశాడు. షూటింగ్స్ సందర్భంగా ధోనితో కలిసి దిగిన ఫోటోలను ఇన్ స్టాగ్రామ్ అకౌంట్లో స్టాన్ పోస్ట్ చేశాడు. వారిద్దరూ కలిసి చేసిన యాడ్ యూట్యూబ్ లో కూడా రిలీజ్ అయింది. షూటింగ్స్ సందర్భంగా తీసిన వీడియోని… హుక్కా వీడియో అంటూ చాలామంది అంటున్నారు. ఇక ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియాలంటే కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.

Advertisement

మరిన్ని  క్రీడల వార్తల కోసం ఇక్కడ చూడండి !  తెలుగు న్యూస్ కోసం ఇక్కడ చూడండి.

Visitors Are Also Reading