Home » MS DHONI : ధోని ఫ్యాన్స్ అంటే ఇదిరా…. ఆటోగ్రాఫ్ కోసం BMW కారు…!

MS DHONI : ధోని ఫ్యాన్స్ అంటే ఇదిరా…. ఆటోగ్రాఫ్ కోసం BMW కారు…!

by Bunty
Ad

 

MS DHONI : టీమిండియా మాజీ సారధి మహేంద్ర సింగ్ ధోని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మహేంద్ర సింగ్ ధోని క్రికెట్ నుంచి రిటైర్ అయి నాలుగేళ్లు దాటుతుంది. ఏడాదికోసారి ఐపీఎల్ లో తప్ప మహి క్రికెట్ లోనే కనబడడం లేదు. అయినా ఫ్యాన్స్ మాత్రం ధోని మీద అభిమానాన్ని పెంచుకుంటూనే పోతున్నారు. క్రికెట్ గ్రౌండ్ లోనే కాదు బయట ఎక్కడ కనిపించినా ధోని వీడియోలు క్షణాల్లో వైరల్ గా మారుతున్నాయి.

MS Dhoni Gives Autograph On Fan`s BMW Car, Video Goes Viral

తాజాగా ఓ అభిమాని ధోనీని కొత్త బిఎండబ్ల్యూ కారులో ఎక్కించుకున్నాడు. కారులో కూర్చున్న తర్వాత ఓ ఆటోగ్రాఫ్ ఇవ్వాలని కోరాడు. ఆటోగ్రాఫ్ ఇస్తాను కానీ ఎక్కడ చేయమంటావు అని అడగ్గా…. తన కారు సీటుపై చేయండి అని కోరాడు ఆ అభిమాని. కొత్త కారు కొత్త సీట్స్ కదా ప్రాబ్లం లేదా అని ధోని అడగ్గా…. మీ ఆటోగ్రాఫ్ ఉంటే చాలు అని ఆ అభిమాని రిక్వెస్ట్ చేయడంతో ధోని సంతకం చేశాడు.

Advertisement

Advertisement

ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. కాగా, మహేంద్ర సింగ్ ధోని… ప్రస్తుతం చెన్నైయ్‌ సూపర్‌ కింగ్స్‌ జట్టుకు కెప్టెన్‌ గా ఉన్నారు. ఇప్పటికే 5 సార్లు చెన్నయ్‌ కి కప్‌ కూడా తెచ్చాడు మహేంద్ర సింగ్ ధోని. అటు 2007 టీ 20 వరల్డ్‌ కప్‌, 2011 వన్డే వరల్డ్‌ కప్‌, 2013 ఛాంపియన్స్‌ ట్రోఫిని కూడా టీమిండియాకు అందించాడు మహేంద్ర సింగ్ ధోని.

Visitors Are Also Reading