టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని పై సౌత్ ఆఫ్రికా మాజీ ప్లేయర్ ఏబీ డివిలియర్స్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మహేంద్రసింగ్ ధోని ఒక్కడి వల్లే ఇండియాకు 2011 వన్డే వరల్డ్ కప్ రాలేదని బాంబు పేల్చాడు ఏబీ డివిలియర్స్. టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. తన కెప్టెన్సీలో టీమిండియా కు అనేక విజయాలను అందించాడు మహేంద్రసింగ్ ధోని.
2007 సంవత్సరంలో టి20 వరల్డ్ కప్, 2011 సంవత్సరంలో వన్డే వరల్డ్ కప్ అలాగే 2013 సంవత్సరంలో ఛాంపియన్ ట్రోఫీని టీమిండియా కు అందించాడు మహేంద్రసింగ్ ధోని. అలాగే టీమ్ ఇండియా జట్టును చాలా సార్లు నెంబర్ వన్ జట్టుగా కూడా నిలిపిన ఘనత ధోని ఖాతాలో ఉంది. అలాంటి మహేంద్ర సింగ్ ధోనీపై ఏబీ డివిలియర్స్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రపంచ కప్ గెలవాలంటే ఒక్కడి వల్ల కాదని… జట్టు సమిష్టి కృషి వల్ల అది సాధ్యమవుతుందని తెలిపాడు ఏబీ డివిలియర్స్.
Advertisement
Advertisement
2011 సంవత్సరంలో టీమిండియా ప్రపంచకప్ గెలిచింది… ఆ సమయంలో ధోని ఒక్కడి వల్లే ఆ కప్ సాధ్యం కాలేదు… అలాగే 2019 సంవత్సరంలో బెన్ స్టాక్స్ వల్ల ఇంగ్లాండ్ విజేత కాలేదు… జట్టులోనే సభ్యులందరూ ఆడితేనే ఛాంపియన్గా నిలిచారు.. అంటూ ఏబీ డివిలియర్స్ చెప్పుకొచ్చాడు. ఇక ఈ ఏడాది జరిగే వన్డే వరల్డ్ కప్ లో టీమిండియా హాట్ ఫేవరెట్ గా ఉంటుందని… ఇందులో గిల్ రాణిస్తాడని అందరికంటే ఎక్కువ పరుగులు చేస్తాడని ధీమా వ్యక్తం చేశాడు ఏబీ డివిలియర్స్.
ఇవి కూడా చదవండి
- Virat Kohli : ఆసీస్ ప్లేయర్లను ర్యాగింగ్ చేసిన కోహ్లీ !
- జగన్ సర్కార్ సంచలనం…బ్రాహ్మణి, భువనేశ్వరి, బాలకృష్ణపైనా కేసులు ?
- చంద్రబాబు చేసిన అతి పెద్ద తప్పు అదే..సంక్షోభంలో TDP !