ఐపీఎల్ లో 2013 లో జరిగిన స్పాట్ ఫిక్సింగ్ అనేది ఎవరు మర్చిపోలేరు. 2013 లో జరిగిన ఈ ఘటన వల్ల భారత స్టార్ పేసర్ గా అప్పటివరకు కొనసాగుతున్న శ్రీశాంత్ పై బీసీసీఐ బ్యాన్ విధించింది. అయితే ఈ కేసును అప్పుడు దర్యాప్తు చేసిన ఐపీఎస్ అధికారి సంపత్ కుమార్… ఈ స్పాట్ ఫిక్సింగ్ లో మహేంద్ర సింగ్ ధోనికి కూడా భాగం ఉంది అని పేర్కొన్నాడు.
Advertisement
కానీ ఈ విషయంలో అప్పుడు ధోని కొరుకు వెళ్ళాడు. అందులో తీర్పుగా ఈ స్పాట్ ఫిక్సింగ్ కేసులు ఎవరు కూడా ధోని పేరు అనేది తీయకూడదు అంటూ తీర్పు ఇచ్చింది. ఇక ఆ తర్వాత కోర్టు నా నోరు మూసేసింది అని అని ఐపీఎస్ అధికారి సంపత్ కుమార్ కామెంట్స్ చేసాడు. అయితే తన పేరును కరాబ్ చేయాలనీ చూసినందుకు ఐపీఎస్ అధికారి సంపత్ కుమార్ పై ధోని పరువు నష్టం కేసు అనేది వేసాడు.
Advertisement
తనకు పరువు నష్టం దావా కావాలని ధోని కొరుకు వెళ్ళాడు. అయితే ఈ కేసులో ఇన్ని రోజుల తర్వాత ఆ పరువు నష్టం దావా అనేది కొట్టేయాలని ఐపీఎస్ అధికారి సంపత్ కుమార్ కోర్టులో పిటిషన్ వేసాడు. ఇక ఆ వెంటనే దానిని కొట్టేయకూడదు అని ధోని కూడా మరో పిటిషన్ అనేది వేసాడు. దాంతో మళ్ళీ ఈ ఫిక్సింగ్ వార్త అనేది తెర పైకి వచ్చింది.
ఇవి కూడా చదవండి :