వివాదాల్లో ముందుండే ఆంధ్రప్రదేశ్ ఎంపీ రఘురామ మరొక తగాదాకు సై అంటున్నారు. తాను పదవీకి రాజీనామా చేస్తే వైసీపీ లెక్క ఏమిటో తేలిపోతుందన్నారు. జగన్ బొమ్మను ఉపయోగించుకోలేదు అని కూడా పేర్కొన్నారు. ఇప్పుడు తన మాట నెగ్గించుకుని జగన్ ప్రతిష్టను మసకబార్చేందుకు నేరుగా సీన్‌లోకి మరొకసారి వచ్చి శీతాకాలంలో రాజకీయాల్లో వేడి పుట్టిస్తున్నారు రఘురామ.
Advertisement
Advertisement
తాను రాజీనామా చేసి మళ్లీ గెలిస్తే జగన్ ఏమైపోతారో అని నరసాపురం వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు మరొకసారి వార్తల్లో నిలిచారు. త్వరలో తాను ఎంపీ పదవీకి రాజీనామా చేస్తాను అని ప్రకటించారని వార్తలు వినిపిస్తున్నాయి. ఆయన ఎప్పటి నుంచో వైసీపీతో విభేదిస్తున్నారు. అయితే జగన్‌ను నేరుగా కోర్టుల్లోను ఢీ కొంటున్నారు.
ఈ నేపథ్యంలో వైసీపీ వర్గాలు రఘురామపై ఎప్పటికప్పుడు కామెంట్లు చేస్తున్నాయి. వచ్చే ఎన్నికల వరకు ఆగడమెందుకు తాను రాజీనామా చేసి మళ్లీ గెలుస్తాను అని వైసీపీ తనపై అభ్యర్థిని నిలబెట్టి సత్తా చాటాలని ఎప్పటి నుండో సవాలు చేస్తూ వస్తున్నారు. ఇప్పుడు రఘురామ రాజీనామా వ్యవహారం హాట్‌టాపిక్‌గా మారింది. రఘురామ రాజీనామా చేసి గెలుస్తారో, లేక ఓడిపోతారో చూడాలి మరీ.