చిరంజీవి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఏ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చారు చిరు. తర్వాత చాలా సినిమాల్లో నటించి ఎంతో మంచి పేరు తెచ్చుకున్నారు. మెగాస్టార్ చిరంజీవి హీరోగా వచ్చిన అంజి సినిమా అందరికీ గుర్తుండే ఉంటుంది. అంజి సినిమా పూర్తి అవడానికి ఐదేళ్లు పట్టింది. గ్రాఫిక్స్ ప్రధానంగా ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ తో కోడి రామకృష్ణ దర్శకత్వంలో ఈ సినిమా వచ్చింది. అలానే జగదేకవీరుడు అతిలోకసుందరి సోషల్ ఫాంటసీ మూవీ గా వచ్చింది.
Advertisement
Also read:
ఈ సినిమాలో గ్రాఫిక్స్ కి అంతగా ప్రాధాన్యతను ఇవ్వలేదు. అంజి మూవీ మాత్రం గ్రాఫిక్స్ తో తీశారు. ఈ మూవీ ప్రారంభమైన నాటి నుండి పూర్తయ్య దాకా ఎన్నో ఇబ్బందులు వచ్చాయట. కెరీయర్ లో నాకు బాగా గుర్తుండిపోయే మూవీ అంజి అని కోడి రామకృష్ణ ఇంటర్వ్యూలో చెప్పారు. ఈ మూవీ నిర్మాణంలో ఎంతో మంది కృషి ఉందని ముందుగా అందరినీ అభినందించాలని ఆయన చెప్పారు. చిరంజీవి గారితో గ్రాఫిక్స్ సినిమా ఎందుకండీ నా దగ్గర ఒక కమర్షియల్ కథ ఉంది అది చేద్దాం అన్నాను కానీ శ్యామ్ గారు ఒప్పుకోలేదని.. ఆయనకు తెలియకుండా చిరంజీవి గారిని కలిసి విషయం చెప్పాను.
Advertisement
Also read:
Also read:
గ్రాఫిక్స్ తో మూవీ అంటే రిస్క్ అని చెప్తే చిరంజీవి గారు కూల్ గా మీరు ఏం కంగారు పడొద్దు ఎంత రిస్క్ అయినా చేద్దామని.. పూర్తి కోపరేషన్ ఉంటుందని అన్నారట. ఈ మూవీలో ఇంటర్వెల్ సీక్వెన్స్ ని తీయడానికి నెల రోజులు టైం పట్టింది. ఒక టాప్ హీరో తన సినిమాలు పూర్తి కావడానికి ఐదేళ్లు ఓపిగ్గా ఉండడం అంటే మామూలు విషయం కాదని కోడి రామకృష్ణ అన్నారు. నా దృష్టిలో అంజి ఒక గొప్ప సినిమా మొదటి సాధారణమైన సినిమాలాగే అనిపించింది. కానీ చూడగా చూడగా అందరికీ నచ్చేసింది ఇప్పటికి టీవీలో ప్రేక్షకులు చూస్తారని కోడి రామకృష్ణ ఇంటర్వ్యూలో చెప్పారు.
తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!