Home » పది రూపాయలకే ట్రీట్మెంట్ చేస్తున్న డాక్టర్.. ఈమె గురించి తెలిస్తే సెల్యూట్ చెయ్యకుండా ఉండలేరు!

పది రూపాయలకే ట్రీట్మెంట్ చేస్తున్న డాక్టర్.. ఈమె గురించి తెలిస్తే సెల్యూట్ చెయ్యకుండా ఉండలేరు!

by Srilakshmi Bharathi
Ad

ప్రైవేట్ విద్యాసంస్థలకు చెందిన పలువురు వైద్య విద్యార్థులు తమ కోర్సు పూర్తయిన తర్వాత విదేశాల్లో లక్షల్లో సంపాదించాలని అనుకుంటారు. కానీ, కడప జిల్లాకు చెందిన డాక్టర్ నూరి పర్వీన్ అనే 28 ఏళ్ల లేడీ డాక్టర్ మాత్రం ఆర్థికంగా వెనుకబడిన వర్గాల ప్రజలకు కేవలం ₹10కే వైద్య సహాయం అందిస్తున్నారు. ఔట్ పేషెంట్లకు కనీస కన్సల్టేషన్ ఫీజ్ కాకుండా.. ఆసుపత్రిలో చేరాల్సిన రోగులకు డాక్టర్ బెడ్‌కు ₹50 మాత్రమే విధించడం ఈ కడప హాస్పిటల్ విశేషం.

Advertisement

డాక్టర్ పర్వీన్ స్వస్థలం విజయవాడ. మధ్యతరగతి కుటుంబం నుండి వచ్చిన ఆమె ఫాతిమా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో MBBS సీటు సంపాదించడానికి పోటీ పరీక్షల్లో విజయం సాధించడానికి చాలానే కష్టపడ్డారు. వైద్య కళాశాల నుండి ఉత్తీర్ణత సాధించిన తర్వాత, ఆమె తన రాష్ట్రంలో వైద్య సంరక్షణను మెరుగుపరచడానికి పని చేయాలని నిర్ణయించుకుంది. “ఖరీదైన చికిత్స భరించలేని వారి కోసం కడపలోని పేద ప్రాంతంలో ఉద్దేశపూర్వకంగా నా క్లినిక్ ప్రారంభించాను” అని డాక్టర్ పర్వీన్ ఓ సందర్భంలో పేర్కొన్నారు.

Advertisement

విజయవాడలో ఇంటికి వచ్చాకా.. కనీసం నా పేరెంట్స్ కి కూడా చెప్పకుండా ఈ క్లినిక్ ను స్టార్ట్ చేశాను. కానీ.. నేను ఇలా చేస్తున్నానని తెలుసుకున్నాక నా పేరెంట్స్ చాలా సంతోషించారు. రోగుల పట్ల ఆమె చూపే ప్రేమ, పేదలకు ఆమె చేసే సాయం చూసి అక్కడి ప్రజలు పర్వీన్ ను ‘మదర్ థెరిస్సా ఆఫ్ కడప’ అని పిలుచుకుంటారు. పేద ప్రజలకు సేవ చేయడానికే తానూ ‘₹10 చొరవ’ ప్రారంభించానని పేర్కొన్నారు. ఈ క్లినిక్ ఫిబ్రవరి 7, 2020న ప్రారంభించారు. కానీ కరోనా వలన ఈ క్లినిక్ మూసేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే.. నిరుపేదలకు అవసరమైన సమయంలో సాయం అందించడం కోసమే.. ఆమె తన క్లినిక్ ని 24 గంటలు తెరచి ఉంచేలా చేయాలనీ నిర్ణయించుకున్నారు. అయితే డాక్టర్స్ ను తిరిగి చైతన్యవంతులను చేయడానికి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల సంఖ్యను పెంచడంతోపాటు సౌకర్యాలను మెరుగుపరచాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆమె పేర్కొన్నారు

మరిన్ని..

చంద్రబాబు కేసుకు సంబంధించి ఆధారాల గురించి నాకు తెలియదు.. లాయర్ పొన్నవోలు సుధాకర్ కామెంట్స్ వైరల్..!

తల్లిదండ్రులు పిల్లల ముందు అస్సలు చేయకూడని ఈ 5 పనులు ఏంటో మీకు తెలుసా..?

ప్రధాని మోడీ కుటుంబం గురించి ఎవ్వరికీ తెలియని విషయాలు ఇవే..!

Visitors Are Also Reading