సాధరణం గా ప్రతి ఇంటి వద్ద మనకు మనీ ప్లాంట్ కనిపిస్తుంది. కొంత మంది మనీ ప్లాంట్ ను పెంచాలని కూడా అనుకుంటారు. అయితే మనీ ప్లాంట్ ను ఎక్కడ నాటాలి? మనీ ప్లాంట్ కు ను ఎలా పెంచాలని చాలా మందికి తెలియదు. దీంతో కొంత మంది మనీ ప్లాంట్ ను ఎక్కుడ పడితే ఎక్కడ ఉంచుతారు. అలా మనీ ప్లాంట్ ను ఎక్కుడ బడితే అక్కడ పెట్టడం వాస్తు దృష్ట్య ఇంట్లో వాళ్లు అపాయం అని వాస్తు పండితులు చెబుతుంటారు. ఈ మధ్య కాలం లో ప్రతి ఇంట్లో ఉండే మనీ ప్లాంట్ మొక్క ను తప్పక ఉంచుతున్నారు. కొంత మంది ఈశాన్య ప్రాంతంలో మనీ ప్లాంట్ ను నాటుతున్నారు. ఇలా ఈశాన్య ప్రాంతం లో మనీ ప్లాంట్ ను నాటడం వల్ల ఇంట్లో వారికి లాభం కన్న నష్టమే ఎక్కువ గా వస్తుందట.
Advertisement
Advertisement
అలాగే కుటుంబ సభ్యలు కూడా అనారోగ్య బారిన పడుతారట. అలాగే ఈశాన్య భాగం లో బరువు కూడా ఉంచ కూడదు. అంటే కుండీ లు పెట్టి అందులో ఇతర పూల చెట్టు కూడా నాటకుడదు. అలాగే మనీ ప్లాంట్ ను కేవలం ఆగ్నేయ దిశ లోనే నాటాలి. ఇలా ఆగ్నేయ దిశ లో మనీ ప్లాంట్ ను నాటుకుంటే ఇంట్లో ఆర్థిక పరిస్థితి మెరుగుఅవుతుందని వాస్తు పండితులు చెబుతారు. ఆగ్నేయ దిశ విఘ్నేషునికి ఇష్టమైన దిశ. కాబట్టి ఆ దిశ లో మనీ ప్లాంట్ ను నాటితే అదృష్టం గా భావిస్తారు. అలాగే మనీ ప్లాంట్ అలా ఉంటే మన చుట్టు ఉండే వాతావరణం ఎల్లప్పుడూ పాజిటివ్ గా ఉంటుంది. అలాగే కుటుంబ సభ్యులకు శక్తిని, అదృష్టాన్ని ఇస్తుందని నమ్మకం.
అలాగే మనీ ప్లాంట్ తీగ పెద్ద గా అయితే దాని ఆకులు గానీ, తీగ గానీ ఇంట్లోకి రాకుండా చూసుకోవాలి. మనీ ప్లాంట్ తీగలు ఇంట్లో కి వాలినట్టు ఉంటే వాస్తు ప్రకారం కీడు జరుగుతుందని వాస్తు పండితులు చెబుతారు. కాబట్టి ఆకులను గానీ తీగలను గానీ ఇంట్లో వాలకుండా చేసుకోవాలి. అలాగే మనీ ప్లాంట్ ఎండిపోయిన ఆకులు లేదా.. పసుపు రంగు లోకి మారిన ఆకులను కూడా ఎప్పటి కప్పుడు కట్ చేయాలి. అలా తొలగించక పోతే వాస్తు దోషం పడుతుందని వాస్తు పండితులు చెబుతున్నారు.