Home » మోక్షజ్ఞ సినీ ఎంట్రీ.. దర్శకుడు ఎవరో తెలుసా..?

మోక్షజ్ఞ సినీ ఎంట్రీ.. దర్శకుడు ఎవరో తెలుసా..?

by Sravya
Ad

నందమూరి బాలకృష్ణ నట వారసుడు మోక్షజ్ఞ సినీ పరిశ్రమలోకి ఎప్పుడు అడుగు పెడతాడా అని అందరూ ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. నందమూరి అభిమానులు అయితే ఎప్పుడెప్పుడు అతను పరిశ్రమలోకి అడుగు పెడతాడని ఎంతో ఆత్రుతగా చూస్తున్నారు. అదిగో వస్తున్నాడని ఇదిగో వస్తున్నాడని అనేక వార్తలు వచ్చాయి. కానీ నందమూరి అభిమానులకు ఎప్పుడు నిరాశ మిగులుతుంది. మోక్షజ్ఞ సినిమాల్లోకి రావడం పక్కా అని వార్తలు వస్తున్నాయి. దీంతో కథ ఏంటి దర్శకుడు ఎవరు అని అంతా అరా తీయడం మొదలుపెట్టారు.

mokshagna

mokshagna

ఈ విషయం బయటకు రావడంతో నిర్మాత ఎవరు అని కూడా అంతా ఇప్పటికే ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. బాలయ్యకు వరుసగా సూపర్ హిట్ సినిమాల్లో అందించడంలో బోయపాటి శ్రీను మోక్షజ్ఞను పరిచయం చేసే బాధ్యత తీసుకుంటారని అంటున్నారు. దీనిపై అధికారికంగా ప్రకటన రావాలి. బాలయ్య వారసుడు సినీ రంగంలోకి వస్తున్నాడు అనే వార్త సోషల్ మీడియాలో హల్ చల్ అవుతోంది.

Advertisement

Advertisement

Also read:

గతంలో బొద్దుగా ఉన్న మోక్షజ్ఞ సినిమాల కోసం లోక్ ను కూడా మార్చుకున్నాడు స్లిమ్ గా కండలు తిరిగిన దేహంతో ఉన్నాడు ఎప్పుడు పరిశ్రమకి పరిచయం అవుతాడని భావించినప్పటికీ అతని జాతకం ప్రకారం ఫలానా సమయం పరిశ్రమంలోకి ప్రవేశిస్తే బాగుంటుందని జ్యోతిష్య నిపుణులు చెప్పారట. అందుకని అప్పటివరకు ఎదురుచూస్తున్నట్లు తెలుస్తోంది. హిందూపురం నుండి బాలయ్య ఎమ్మెల్యేగా పోటీ చేసిన విషయం తెలిసిందే మూడోసారి గెలిచి హ్యాట్రిక్ కొట్టాలనే లక్ష్యంతో బాలయ్య చూస్తున్నారు.

తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

 

 

Visitors Are Also Reading