విలక్షణ నటుడు, కలెక్షన్ కింగ్ మోహన్ బాబు తాజాగా ఓ వివాదంలో చిక్కుకున్నారు. షిర్డీ సాయిబాబా దేవాలయంపై ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దుమారం రేపుతున్నాయి. మోహన్ బాబు వ్యాఖ్యలపై భక్తులు మండిపడుతున్నారు. అసలు ఇంతకి మోహన్ బాబు ఏం మాట్లాడారు..? భక్తులు ఎందుకు మండి పడుతున్నారని ఇప్పుడు మనం తెలుసుకుందాం.
తిరుపతి జిల్లాలోని చంద్రగిరి మండలం, రంగంపేటలో మోహన్ బాబు పెద్ద సాయిబాబా గుడిని నిర్మించారు. దక్షిణాదిలోనే ఇది అతిపెద్ద టెంపుల్ కావడం విశేషం. ఇటీవలే ఈ గుడిలో విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం నిర్వహించారు. మోహన్ బాబు హాజరై మాట్లాడారు. ఈ దేవాలయం నుంచి అద్భుతంగా వర్ణించారు. తన దృష్టిలో భక్తులు షిర్డీ సాయినాథుని ఆలయానికి వెళ్లనక్కర లేదని వ్యాఖ్యానించారు. ఇదే ఇప్పుడు భక్తుల మనోభావాలను దెబ్బ తీసినట్టయింది. మోహన్ బాబు చేసిన ఈ వ్యాఖ్యలపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మోహన్ బాబు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తూ.. సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తున్నారు. దీంతో మోహన్ బాబు వ్యాఖ్యలు పెను దుమారంగా మారాయి. ఈ వివాదంపై మోహన్ బాబు ఎలా స్పందిస్తారో చూడాలి.
Advertisement
Advertisement
ఇక ఇదిలా ఉండగా.. రంగంపేటలోని సాయిబాబా ఆలయ విగ్రహ ప్రతిష్ట సందర్భంగా మోహన్ బాబు మాట్లాడుతూ.. ఈ గుడిని నిర్మించాలనుకున్నప్పుడు మంచు విష్ణు ఓ మాట అన్నాడు. వేంకటేశ్వరస్వామి భక్తులందరూ ఈ గుడికి రావాలని.. అలా కడితే కట్టండి లేకపోతే లేదని.. తాను అలానే కట్టానని భావిస్తున్నట్టు చెప్పారు మోహన్ బాబు. ఈ గుడి కట్టడం చాలా అద్భుతం అని, రుషికేష్ నుంచి దాదాపు 110 సంవత్సరాలకు పైనున్న యోగి సహాయోగులు, రుషీశ్వరుల నుంచి చెక్కలు, అమూల్యమైన మూలికలు తీసుకొచ్చి ఆలయంలో పెట్టినట్టు వెల్లడించారు. ఇదంతా తన ఒక్కడి కోసం కాదని.. విద్యాలయం, పక్కన ఉన్న గ్రామాలు, రెండు తెలుగు రాష్ట్రాలు, యావత్ భారతదేశం నెంబర్ వన్ గా ఉండాలన్నదే తన కోరిక అని చెప్పారు. ఈ గుడి ప్రారంభోత్సవంలో మంచు విష్ణు, మంచు మనోజ్ లక్ష్మీ ప్రసన్న లతో పాటు మంచు ఫ్యామిలీ మొత్తం పాల్గొనడమే కాకుండా పెద్ద ఎత్తున అభిమానులు తరలివచ్చారు.
Also Read :
తాత అల్లు రామలింగయ్య ఫోటోను పంచుకున్న అల్లుఅర్జున్.. సోషల్ మీడియాలో వైరల్..!
అనిల్, దిల్ రాజును విడదీసిన షైన్ స్క్రీన్స్..!