Telugu News » Blog » తాత అల్లు రామ‌లింగ‌య్య ఫోటోను పంచుకున్న అల్లుఅర్జున్‌.. సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌..!

తాత అల్లు రామ‌లింగ‌య్య ఫోటోను పంచుకున్న అల్లుఅర్జున్‌.. సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌..!

by Anji
Ads

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా త‌న తాతఅల్లు రామ‌లింగ‌య్య ఫోటోని సోష‌న్ మీడియాలో షేర్ చేశారు. పైన గోడ‌కి తాత ఫోటో వేలాడుతుంది. దాన్ని కింద నుంచి కెమెరాతో క్లిక్ మనిపిస్తున్న‌ట్టుగా ఉన్న‌ది ఈ పోటో. ట్విట్ట‌ర్ ద్వారా షేర్ చేస్తూ సింపుల్ గా ఓ క్యాప్ష‌న్ ఇచ్చారు బ‌న్నీ. ఆయ‌న మా ఫౌండేష‌న్ అని పేర్కొన్నారు. ప్ర‌స్తుతం ఇది సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.  ఈ ఫోటోని అభిమానులు తెగ‌ వైర‌ల్ చేస్తున్నారు. ఇక దీనికి తోడు అల్లు అర్జున్ యాష్ ట్యాగ్ #AANo1Choice`  సోష‌ల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది. పుష్ప చిత్రంలోని ఆయ‌న డిఫ‌రెంట్ ఎమోష‌న్స్‌, డిప‌రెంట్ ఎమోష‌న్స్‌, డిఫ‌రెంట్ ఎక్స్ ప్రెష‌న్స్ తో కూడిన ఫోటోని మిక్స్ చేసి ఆ ఫోటోని వైర‌ల్ చేస్తున్నారు. అల్లుఅర్జున్ నెంబ‌ర్ వ‌న్ ఛాయిస్ అని చాటి చెబుతున్నారు అభిమానులు.

Ads

  పుష్ప చిత్రంతో బ‌న్నికి పాన్ ఇండియా ఇమేజ్ వ‌చ్చింది. దీంతో దేశ‌వ్యాప్తంగా అల్లు అర్జున్ ఓ బ్రాండ్ గా మారారు. ఇప్ప‌టికే ఆయ‌న ఫ‌స్ట్ చాయిస్ గా మారుతున్నార‌ని పేర్కొంటున్నారు. అభిమానులు ఏఏ ఓ బ్రాండ్ గా ప్ర‌మోట్‌చేస్తున్నారు. ఇక ట్విట్ట‌ర్ లో అయితే అల్లు అర్జున్ పేరు మారు మ్రోగిపోతుంది. ఇదిలా ఉండ‌గా మ‌రోవైపు బ‌న్నీకి వ్య‌తిరేకంగా కొన్ని ట్రోల్స్ వైర‌ల్ అవుతున్నాయి. నెగిటివ్ కామెంట్స్ సైతం ట్రెండ్ కావ‌డం గ‌మ‌నార్హం. ఆయన పంచుకున్న పోస్ట్ తాత అల్లు రామ‌లింగ‌య్య ఫోటోని పంచుకుని ఆయ త‌మ ఫౌండేష‌న్ అని పేర్కొన‌డంతో యాంటి ఫ్యాన్స్ రెచ్చిపోతున్నారు. పాత వీడియోలు, క్లిప్‌ల‌ను పంచుకుంటూ ఆడుకుంటున్నారు.

Ads

మొద‌టి నుంచి త‌మ ఫ్యామిలీకి పునాది వేసింది చిరంజీవి అని చెప్పుకుంటూ వ‌చ్చావ‌ని.. చిరంజీవి వ‌ల్లె తామంతా ఈ స్థాయిలో ఉన్నామ‌ని ఆయ‌న చెట్టుకింద పిల్ల మొక్క‌ల‌మ‌ని చెప్పుకొచ్చిన బ‌న్నీ, ఇప్పుడు మాట మార్చార‌ని అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఒక్క హిట్ వ‌స్తే అన్ని మార్చేస్తారా..? అంటూ సెటైర్లు వేస్తున్నారు. మావ‌య్య చిరంజీవి వ‌ల్లే ఇండ‌స్ట్రీకి వ‌చ్చాను అని.. ఇప్పుడు మా అల్లు ఆర్మీ స‌పోర్ట్ వ‌ల్లే ఇండ‌స్ట్రీకి వ‌చ్చాన‌ని చెప్పుకుంటున్నారంటూ మీమ్స్ తో ఆడుకుంటున్నారు. ఇదిలా ఉండ‌గా అల వైకుంఠ‌పురంలో.. పుష్ప చిత్రాల‌తో పాన్ ఇండియా స్టార్ ఎదిగారు బ‌న్నీ. కేవ‌లం ఇండియా వైడ్‌గానే కాదు.. ఇత‌ర దేశాల్లోని సెల‌బ్రిటీలు, క్రికెట‌ర్లు సైతం బన్నీ మ్యాన‌రిజాన్ని స్టెప్పుల‌ను ఫాలో అవుతూ రీల్స్ చేయ‌డం విశేషం. గ‌త ఏడాది డిసెంబ‌ర్ 17న పుష్ప విడుద‌లైన విష‌యం తెలిసిందే. సుకుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ సినిమా సంచ‌ల‌న విజ‌యం సాధించింది. డివైడ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా నెమ్మ‌దిగా పుంజుకుని ఏకంగా 350 కోట్ల క‌లెక్ష‌న్  రాబట్టింది. క‌ష్ట‌కాలంలో త‌క్కువ టికెట్ రేట్ల‌లోనే ఈ రేంజ్ క‌లెక్ష‌న్లని రాబ‌ట్టుకోవ‌డం విశేషం.

 Also Read : 

మెగా ఫ్యామిలీలో కోల్డ్ వార్‌.. చిరంజీవిని టార్గెట్ చేసిన త‌మ్ముళ్లు, మేన‌ల్లుడు..!

Ad

Astrology : ఈ రాశుల వారికి పార్టీలు ఇవ్వ‌డమంటే చాలా ఇష్ట‌మంట‌..!