Home » చాలా బాధ‌ప‌డుతున్నా..ట్రోల్స్ మీమ్స్ పై మోహ‌న్ బాబు..!

చాలా బాధ‌ప‌డుతున్నా..ట్రోల్స్ మీమ్స్ పై మోహ‌న్ బాబు..!

by AJAY
Ad

మా ఎన్నిక‌ల నాటి నుండి మోహ‌న్ బాబు పై మంచు విష్ణు పై సోష‌ల్ మీడియాలో ట్రోలింగ్ పెరిగిన సంగ‌తి తెలిసిందే. అయితే తాజాగా మోహ‌న్ బాబు త‌నపై వ‌స్తున్న ట్రోల్స్ పై మీమ్స్ పై స్పందించారు. సోష‌ల్ మీడియాలో వ‌స్తున్న ట్రోల్స్ వ‌ల్ల చాలా బాధ‌ప‌డుతున్నా అంటూ వ్యాఖ్యానించారు. అలాంటివి ప‌ట్టించుకోన‌వ‌స‌రం లేన‌ప్ప‌టికీ మ‌నిషిగా ఆత్మాభిమానం ఉంటుంది కాబ‌ట్టి కొన్ని విష‌యాల‌లో బాధ‌ప‌డ‌క త‌ప్ప‌ద‌ని అన్నారు. వ్యంగ్య దోర‌ణి కాస్త ఇబ్బందిగా ఉంటుంద‌ని మోహ‌న్ బాబు అన్నారు. తాను అలాంటివి చూడ‌న‌ని కానీ ఎవ‌రైనా పంపిచిన‌ప్పుడు చూస్తున్నాన‌ని చెప్పారు.

Advertisement

Advertisement

టాలీవుడ్ లోని ఓ ఇద్ద‌రు హీరోలు 50 నుండి 100 మందిని అపాయింట్ చేసుకుని ప్ర‌తిఒక్క‌రినీ ట్రోలింగ్ చేయిస్తున్నారని మోహ‌న్ బాబు ఆరోపించారు. ఆ హీరోలు త‌న‌కు తెలుస‌ని తాత్కాలికంగా వారు బాగున్న‌ప్పటికీ ఏదో ఒక‌రోజు శిక్ష అనుభ‌వించ‌క త‌ప్ప‌దు అంటూ కామెంట్లు చేశారు. ఎదుటివారిని ఇబ్బంది పెట్టేలా మీమ్స్ ఉండ‌కూడ‌దు అంటూ మోహ‌న్ బాబు వ్యాఖ్యానించారు. అయితే మోహన్ బాబు త‌న‌పై ట్రోల్స్ చేయిస్తున్న వారి పేర్ల‌ను మాత్రం బ‌య‌ట‌కు చెప్ప‌లేదు. దాంతో ఆ ఇద్ద‌రు హీరోలు ఎవ‌రా అని సోష‌ల్ మీడియాలో జోరుగా చ‌ర్చ జ‌రుగుతోంది.

Visitors Are Also Reading