నేడు నటుడు మోహన్ బాబు పుట్టిన రోజును జరుపుకుంటున్నారు. రీసెంట్ గా మోహన్ బాబు సన్ ఆఫ్ ఇండియా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా ఆశించినమేర విజయం సాధించలేకపోయింది. ఇదిలా ఉండగా మోహన్ బాబు నేడు తన పుట్టిన రోజు సంధర్భంగా సినీకార్మికులకు బంపరాఫర్ ను ప్రకటించారు. మోహన్ బాబు కు విద్యానికేతన్ పేరుతో విద్యాసంస్థలు ఉన్న సంగతి తెలిసిందే.
Advertisement
ఈ విద్యాసంస్థల్లో ఇప్పటికే పేద విద్యార్థులకు ఫీజులో రాయితీలు ఇస్తున్నారు. ఇక రీసెంట్ గా తిరుపతిలో యూనివర్సిటీని ప్రారంభిస్తున్నట్టు కూడా మోహన్ బాబు ప్రకటించారు. అయితే తాజాగా తన యూనివర్సిటిలో సినీకార్మికుల పిల్లలకు కూడా ఫీజులో రాయితీలు ఇస్తున్నట్టు మోహన్ బాబు ప్రకటించారు. ఇండస్ట్రీలో 24 క్రాఫ్ట్స్ లో పనిచేస్తున్న వారి పిల్లలకు ఫీజులు రాయితీ ఇస్తున్నామని మోహన్ బాబు ప్రకటించారు.
Advertisement
ఈ మేరకు మోహన్ బాబు ఓ వీడియోను విడుదల చేశారు. వీడియోలో సినిమాతల్లి తనకు ఎంతో ఇచ్చిందని..ఉడతాభక్తిగా ఏదైనా చేయాలనే ఆలోచన తనకు వచ్చిందని తెలిపారు. యూనివర్సిటిలో చదువుకోవాలనుకే 24 క్రాఫ్ట్స్ లో పనిచేస్తున్నవారి పిల్లలకు రాయితీలు ఇస్తామని చెప్పారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. 1992 లో విద్యానికేతన్ విద్యాసంస్థలను ప్రారంభించామని తెలిపారు. ఇప్పుడు దానికి మోహన్ బాబు యూనివర్సిటీగా మారుస్తున్నామని వెల్లడించారు. విద్యానికేతన్ ద్వారా 25 శాతం మందికి ఉచితంగా విద్యను అందిస్తున్నామని తెలిపారు.