ప్రస్తుతం రోహిత్ శర్మ కెప్టెన్సీలోని భారత జట్టు ఆస్ట్రేలియాలో ఉన్న విషయం తెలిసిందే. సౌత్ ఆఫ్రికాతో ఇక్కడ టీ20 సిరీస్ అనేది ఆడి… ఈ నెలలో ప్రారంభం కాబోతున్న ప్రపంచ కప్ కోసం ఆ జట్టు అక్కడికి వెళ్ళింది. ఇక ఇక్కడ ఇండియాలో శిఖర్ ధావన్ కెప్టెన్సీలో మరో టీమిండియా సౌత్ ఆఫ్రికాతో వన్డే సిరీస్ అనేది ఆడుతుంది.
Advertisement
అయితే మొదట టీ20 సిరీస్ లో ఫీల్డింగ్ తప్పులు చేసిన పేసర్ మొహ్మద్ సిరాజ్.. ఇప్పుడు వన్డే సిరీస్ లో కూడా చేస్తున్నాడు. అక్కడ క్యాచ్చులు వబాదిలేసిన సిరాజ్.. ఇక్కడ అతి ఆవేశంలో ఉచితంగా పరుగులు ఇస్తున్నాడు. అయిన కూడా బౌలింగ్ లో మాత్రం బాగానే రాణిస్తున్నాడు. రెండో వన్డేలో 3 వికెట్లు తీసిన సిరాజ్.. ఓ మేడిన్ ఓవర్ కూడా వేసాడు.
Advertisement
ఇక ఈ మేడిన్ ఓవర్ తో ఓ ప్రపంచ రికార్డ్ అనేది సృష్టించాడు. వన్డే ఫార్మాట్ లో ఇది సిరాజ్ కు 11 వ మేడిన్ ఓవర్. ఇప్పటివరకు ప్రపంచ క్రికెట్ లో ఏ బౌలర్ కూడా వన్డేలలో ఇన్ని మేడిన్ ఓవర్లు అనేవి వెయ్యలేదు. అందువల్ల అత్యధికంగా వన్డేల్లో మేడిన్ ఓవర్లు వేసిన ఆటగాడిగా సిరాజ్ వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేసాడు. ఇక ప్రపంచ కప్ జట్టులో గాయపడిన బుమ్రా స్థానంలో కూడా సిరాజ్ వెళ్లే అవకాశాలు అనేవి ఎక్కువ ఉన్నట్లు తెలుస్తుంది.
ఇవి కూడా చదవండి :