వరల్డ్ కప్ 2023 టోర్నమెంట్ కు ముందు టీమిండియా ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ షమీకి బిగ్ రిలీఫ్ లభించింది. తన భార్య వేసిన గృహహింస కేసులో తాజాగా మహమ్మద్ షమికి బెయిల్ మంజూరు అయింది. టీమిండియా ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ షమీ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ప్రతి బంతి 150 స్పీడ్ వేగంతో వేయగల సమర్థుడు మహమ్మద్ షమీ.
Advertisement
తన ఏజ్ పైబడినప్పటికీ యంగ్ బౌలర్లకు పోటీ ఇస్తూ టీమిండియాలో కొనసాగుతున్నాడు మహమ్మద్ షమీ. ఫిట్నెస్, ఆట ప్రదర్శనతో వరల్డ్ కప్ 2023 కోసం ప్రకటించిన జట్టులో కూడా… మహమ్మద్ షమీ చాన్స్ దక్కించుకున్నాడు. ఇది ఇలా ఉండగా గృహహింస కేసులో టీమిండియా ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ షమీకి ఆలీపూర్ లోని ట్రయల్ కోర్టు బెయీల్ మంజూరు చేసింది. షమీ భార్య… హసీన్ జహాన్ 2018 సంవత్సరంలో షమీతో పాటు అతని సోదరుడిపై గృహహింస కేసు పెట్టింది.
Advertisement
ఈ కేసులో భాగంగా నిన్న మహమ్మద్ షమీ కుటుంబ సభ్యులు కోర్టు విచారణకు హాజరయ్యారు. ఈ సందర్భంగా మహమ్మద్ షమీ తరపు న్యాయవాది బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై విచారణ చేసిన ఆలీపూర్ ట్రయల్ కోర్ట్… మహమ్మద్ షమీకి బెయిల్ మంజూరు చేసింది. 2000 రూపాయల పూచికత్తుతో సమితో పాటు అతని సోదరుడికి కూడా బెయీల్ మంజూరు చేసింది ట్రయల్ కోర్ట్.
ఇవి కూడా చదవండి
- World Cup 2023 : చేతులెత్తేసిన పోలీసులు…PAK మ్యాచ్కు ప్రేక్షకులకు నో ఎంట్రీ!
- చంద్రబాబు అరెస్టుపై స్పందించిన హీరో విశాల్…జగన్ సర్కార్ పై సంచలన వ్యాఖ్యలు !
- Asia Cup 2023 : ఆసియా కప్పు తీసుకొచ్చి ఇతని చేతుల్లో పెట్టారు! ఎవరితను?