ప్రపంచ క్రికెట్ లో పాకిస్థాన్ జట్టుకు మంచి పేరు అనేది ఉంది. కానీ ఇప్పుడు ఆ జట్టుకు సరైన కెప్టెన్ అనేవారు లేరు. మన ఇండియా జట్టులో ఒక్కరు కాకపోతే ఒక్కరు కెప్టెన్ అని పెద్ద లైన్ ఉంటె.. అక్కడ మాత్రం ఎవరు కెప్టెన్సీ చేయగలను అని వెతుకుంటున్నారు. ప్రస్తుతం కెప్టెన్ గా ఉన్న బాబర్ ఆజాం అద్భుతమైన బ్యాటర్ అని అందరూ ఒప్పుకుంటారు. కానీ అతనిలో కెప్టెన్సీ స్కిల్స్ అనేవి లేవు.
Advertisement
ఈ విషయం పాక్ మాజీలు కూడా చాలాసార్లు చెప్పారు. అతను కెప్టెన్ గా తప్పుకోవాలని.. ఆ కెప్టెన్సీ వల్లే ఇప్పుడు ప్రపంచ కప్ లో విఫలం అవుతన్నాడు అని అంటున్నారు. దాంతో బాబర్ కెప్టెన్ గా తప్పుకోవాలి అని అనుకోకున్నా.. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు మాత్రం బాబర్ ను తప్పించాలని ఫిక్స్ అయ్యినట్లు తెలుస్తుంది. ఈ క్రమంలోనే కొత్త కెప్టెన్ వేటలో పాక్ బోర్డు పడింది.
Advertisement
అయితే బాబర్ కాకుంటే ఆ జట్టును మరో ఓపెనర్ ఆయన మొహ్మద్ రిజ్వాన్ కు ఇవ్వాలని డిమాండ్ వస్తుంది. బాబర్ లేని సమయంలో గతంలో పాకిస్థాన్ జట్టుకు కొన్ని మ్యాచ్ లు కెప్టెన్సీ చేసిన రిజ్వాన్.. పాకిస్థాన్ సూపర్ లీగ్ లో తన జట్టుకు టైటిల్ ను కూడా అందించాడు. అందుకే బాబర్ కాకుంటే.. రిజ్వాన్ ను కెప్టెన్ చేయాలనీ ఫ్యాన్స్ కోరుతున్నారు. చూడాలి మరి ఈ విషయంలో పాక్ బోర్డు ఏం చేస్తుంది అనేది.
ఇవి కూడా చదవండి :