భారత్ vs పాకిస్థాన్ అంటేనే దానికి ఎక్కడ లేని క్రేజ్ అనేది వస్తుంది. అది క్రికెట్ లో అయితే మరి ఎక్కువ. ఎందుకంటే ఈ రెండు దేశాలలో అభిమానులు క్రికెట్ నే ఎక్కువ ఆరాధిస్తారు. అందుకు ప్రపంచ కప్ లలో భారత్, పాకిస్థాన్ ఎదురుపడుతున్నాయి అంటే చాలు అభిమానులు ఆ స్టేడియంకు క్యూ కడుతారు. ఇక కొంత మంది ఆటగాళ్లు కూడా అలానే ఒక్కరి గురించి ఒక్కరు మాట్లాడుకుంటారు. అయితే మన మాజీ కెప్టెన్ ఇరత్ కోహ్లీకి పొగరు ఎక్కువ అని పాక్ ఆటగాళ్లు చెబుతున్నారట. ఈ విషయాన్ని ఆ జట్టు కీపర్ మొహ్మద్ రిజ్వాన్ తెలిపాడు.
Advertisement
తాజాగా రిజ్వాన్ మాట్లాడుతూ… నేను గత ఏడాది జరిగిన ప్రపంచ కప్ సమయంలోనే మొదటిసారి విరాట్ కోహ్లీని కలిసాను. అంతకముందు కేవలం అంతని గురించి విన్నాను అంతే. మా జట్టు ఆటగాళ్లు అలాగే ఇంత జట్ల ఆటగాళ్ల నుండి నేను విన్నది ఏంటంటే కోహ్లీకి పొగరు ఎక్కువ అని విన్నాను. అతను గ్రౌండ్ లో చాలా పొగరుగా వ్యవరిస్తాడు అని చెప్పారు. కానీ ఆ ప్రపంచ కప్ సమయంలో నేను అతడిని కలిసిన తర్వాత మొత్తం సిన్ రివర్స్ అయింది.
Advertisement
కోహ్లీ చాలా ప్రశాంతంగా మామూలుగానే ఉన్నాడు. అతని మాటలను బట్టి చూస్తే మేమంతా ఒక్క కుటుంబం లా అనిపించింది. క్రికెటర్లు అందరూ ఒకే కుటుంబం. అందుకే ఇప్పిడి నేను కోహ్లీని మా కోహ్లీ అని అన్న కూడా ఏం సమస్య లేదు అని చెప్పాడు. అయితే ఈ మ్యాచ్ లో భారత ఇచ్చిన 152 పరుగుల లక్ష్యాన్ని రిజ్వాన్ మరో ఓపెనర్ బాబర్ ఆజాంతో కలిసి వికెట్ పడకుండానే అది పడేసాడు. దాంతో ఇండియా 10 వికెట్ల తేదతో ఓడిపోయింది.
ఇవి కూడా చదవండి :