Home » మిథాలీ రిటైర్మెంట్ ఇవ్వడానికి వారే కారణమా..?

మిథాలీ రిటైర్మెంట్ ఇవ్వడానికి వారే కారణమా..?

by Azhar
Ad

అంతర్జాతీయ జట్టుకు సచిన్ టెండ్యూలక్ర్ కంటే ఎక్కువ రోజులు సేవలందించిన క్రికెటర్ గా గుర్తింపు పొందింది మిథాలీ రాజ్. అలాగే సచిన్ తో సమానంగా ఆరు ప్రపంచ కప్ టోర్నీలలో ఆడిన ప్లేయర్ గా రికార్డ్ సొంతం చేసుకుంది. కానీ అటువంటి మిథాలీ ఈరోజు ఎవరు ఊహించని విధంగా తన అంతర్జాతీయ కెరియర్ కు వీడ్కోలు పలికింది. కానీ తన రిటైర్మెంట్ కు జట్టులో ఆ ఇద్దరితో ఉన్న గొడవలే కారణం అని వార్తలు వస్తున్నాయి.

Advertisement

అయితే మిథాలీకి భారత మహిళల జట్టు హెడ్ కోచ్ గా ఉన్న రమేష్ పవర్ కు మధ్య ఉన్న వాగ్వాదం గురించి అందరికి తెలిసిందే. 2018 ప్రపంచ కప్ సమయంలో తనను జట్టులో ఉంచకపోవడంతో రమేష్ పవర్ పై మిథాలీ ఆరోపణలు చేసింది. తనను కావాలనే జట్టుకు దూరం చేస్తున్నారు అని తెలిపింది దాంతో రమేష్ పవర్ కూడా మిథాలీ ఎప్పుడు జట్టు కోసం కాకుండా తన సొంత రికార్డుల కోసమే అడవుతుంది అని అన్నాడు. కానీ ఆ సమయంలోనే రమేష్ పవర్ పదవి కాలం ముగియడంతో ఆ గొడవ సద్దుమణిగింది. కానీ ఇప్పుడు మళ్ళీ జట్టు హెడ్ కోచ్ గా అతనే వచ్చాడు. అందువల్ల వీరి మధ్య మళ్ళీ విబేధాలు వచ్చాయి అని అంటున్నారు.

Advertisement

ఇక అదే విధంగా మిథాలీ ఇంతకముందే టీ20 జట్టుకు గుడ్ బై చెప్పడంతో ఆ ఫార్మాట్ లో కెప్టెన్ హర్మాన్ ప్రీత్ కౌర్ వ్యవరిస్తుంది. అలాగే వన్డే జట్టుకు వైస్ కెప్టెన్ గా కూడా ఉంది. అయితే ఇక్కడే హర్మాన్ కు మరియు మిథాలీకి మధ్య విబేధాలు వచ్చాయి అని సమాచారం. మిథాలీ సీనియర్ గా చాలా నెమ్మదిగా ఉంటుంది అని.. ఇదే హర్మాన్ కు నచ్చదు అని తెలుస్తుంది. ఈ విబేధాలు కూడా మిథాలీ వీడ్కోలుకు కారణం కావచ్చు. అయితే ఇప్పుడు మిథాలీ తప్పుకోవడంతో వన్డే కెప్టెన్ గా కూడా హర్మాన్ నే నియమించింది బీసీసీఐ.

ఇవి కూడా చదవండి :

మిథాలీ వీడ్కోలుతో కెప్టెన్ గా హర్మాన్ ప్రీత్..!

భారత కెప్టెన్ గా పంత్.. సిరీస్ కు రాహుల్ దూరం..!

Visitors Are Also Reading