కిన్నెర మొగులయ్య ఇప్పుడు పద్మశ్రీ మొగులయ్యగా గుర్తింపు తెచ్చుకున్నారు. నిజానికి మొగులయ్యకు మొదటగా గుర్తించింది మాత్రం పవన్ కల్యాణ్ అని చెప్పడంలో సందేహం అక్కర్లేదు. భీమ్లా నాయక్ సినిమాలో ఓ పాటకు మొగులయ్య కిన్నెర స్వరాలు అందించి ఎంతో గుర్తింపును సంపాదించుకున్నారు. ఆ పాట యూట్యూబ్ ను షేక్ చేసింది. అంతే కాకుండా పవన్ కల్యాణ్ మొగులయ్యకు ఆర్థిక సహాయం చేయడంతో పాటూ మొగులయ్య లాంటి కళాకారులను గుర్తించాలని చెబుతూ వెలుగులోకి తీసుకువచ్చారు.
మొదటగా ఓ దర్శకుడు ఫోన్ చేసి పవన్ కల్యాణ్ తో ఫోన్ మాట్లాడిపించారని అన్నారు. తనకు మొదట పవన్ కల్యాణ్ గురించి పెద్దగా తెలియది అన్నారు. పవన్ కల్యాణ్ తన కోసం కారు పంపించి షూటింగ్ కు రావాలని ఆహ్వానించారని చెప్పారు. పవన్ కల్యాణ్ కు తాను ఓ కిన్నెరను అందించానని చెప్పారు. అంతే కాకుండా తనను హైదరాబాద్ లో ఓ లాడ్జిలో ఉంచి అక్కడ నుండి బెంగుళూరు పంపించారని చెప్పారు.
Advertisement
Advertisement
మొదటగా తాను ఆడ లేడు ఈడ లేడు అనే పాటను తాను వినిపించానని అన్నారు. అదే పాటలో కొన్ని మార్పులు చేయించారని అన్నారు. తనతో మూడు సార్లు పాటను పాడించారని అన్నారు. చెన్నై లో షూటింగ్ కు తీసుకువెళ్లానని అన్నారు. పవన్ కల్యాణ్ ది చాలా గొప్ప మనసు అని అన్నారు.
ALSO READ : బండ్ల గణేష్ ఆ రాజకీయనాకుడికి బినామీ ?
తను పవన్ కల్యాణ్ పుట్టిన రోజుకు శుభాంకాంక్షలు చెబుతామని అనుకున్నానని కానీ అప్పుడు కుదరలేదని అన్నారు. తనకు ఖర్చులకు డబ్బులు ఇస్తానని చెప్పారని ఇంకా డబ్బులు ఇస్తామని అన్నారు. తాను డబ్బులకోసం ఆశపడనని చెప్పారు. తాను కళ కోసం పనిచేశానని అన్నారు.