ప్రధాన నరేంద్ర మోడీ శుక్రవారం మహారాష్ట్ర లో సోలాపూర్ లో పర్యటించారు. ఆయన ఆవాస్ యోజన అర్బన్ పథకం కింద పేద ప్రజలకు ఆయన చేతుల మీదగా ఇల్లు ని అందించారు. తర్వాత ఆయన మాట్లాడుతూ ఆవాస్ యోజన కింద నిర్మించిన అతి పెద్ద సొసైటీని నేడు ప్రారంభించమని చెప్పారు. ఈ ఇళ్ళను చూడగానే తనకి బాల్యం గుర్తొచ్చిందని ఎమోషనల్ అయ్యారు. మోడీ చిన్నతనంలో తనకి కూడా ఇలాంటి ఇంట్లో నివసించే అవకాశం వస్తే ఎలా ఉండేదో అని ఆలోచించా అంటూ తన బాల్యాన్ని గుర్తు చేసుకుని కన్నీళ్లు పెట్టుకున్నారు.
Advertisement
Advertisement
అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవం గురించి ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు జనవరి 22న ప్రతి ఒక్కరు కూడా ఇళ్లల్లో రామజ్యోతి ని వెలిగించాలని చెప్పారు శ్రీరాముడు నిజాయితీని తన ప్రభుత్వం ఆదర్శంగా తీసుకుందని ప్రధాని చెప్పారు. మన విలువల్ని, కట్టుబాటుల్ని గౌరవించాలని భగవంతుడు బోధించారని చెప్పారు. అదే బాటలో నడుస్తూ పేదల సంక్షేమం వారి సాధికారత కోసం పనిచేస్తున్నానని చెప్పారు మోడీ. ప్రజల కలలే తమ ప్రభుత్వ హామీలను అన్నారు. మా పాలనలో చిట్టచివరి వ్యక్తికి కూడా అభివృద్ధి ఫలాలు అందించడానికి కృషి చేస్తామని ప్రధాని నరేంద్ర మోడీ ఈ సందర్భంగా చెప్పడం జరిగింది.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!