ఎన్నికలు దగ్గర పడుతున్నాయి ఏపీకి రాష్ట్ర విభజన సందర్భంగా ఇచ్చిన హామీల్లో భాగంగా కేంద్రం పలు జాతీయ విద్యా సంస్థలను ఇచ్చింది. వీటి క్యాంపస్ల నిర్మాణం ఎప్పుడో అయ్యింది. అయితే పూర్తి అవడం మాత్రం ఆలస్యం అవుతుంది దీంతో ఐఐటి వంటి సంస్థలు తాత్కాలిక క్యాంపస్లలోనే కాలం గడిపేస్తున్నాయి. ఇటువంటి వాటిలో వైజాగ్ ఐఏఎం తిరుపతి ఐఐటి కూడా ఉన్నాయి. వీటిని ప్రధాని నరేంద్ర మోడీ ఈరోజు ఢిల్లీ నుంచి వర్చువల్ గా మొదలుపెట్టారు విభజన హామీల్లో భాగంగా ఏపీకి కేటాయించిన వైజాగ్ ఐఏఎం తిరుపతి ఐఐటీ లని గత టిడిపి ప్రభుత్వం హయాంలో కేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది వాటికి అవసరమైన రెగ్యులర్ క్యాంపస్ల నిర్మాణం మాత్రం పూర్తవలేదు.
Advertisement
దీంతో 2016 నుంచి తాత్కాలిక క్యాంపస్లలోనే వీటిని నడపాల్సి వచ్చింది. ఇన్నాళ్ళకి నిర్మాణాలు పూర్తి చేసుకోవడంతో వాటిని మోడీ ప్రారంభించారు. అదే టైంలో కర్నూలు ట్రిపుల్ ఐటీ ని సైతం మోడీ ఈరోజు జాతికి అంకితం చేశారు. తిరుపతి ఐఐటి భవనాన్ని ప్రారంభించిన మోడీ అక్కడే శ్రీనివాసపురంలోని భవనాన్ని కూడా ప్రారంభించారు జాతికి అంకితం చేశారు.
Advertisement
గతం లో ఏపీ విభజన సందర్భంగా ఇచ్చిన హామీల లో ఏ ఒక్కటి పూర్తి కాలేదు అని ఆరోపణలు ఎదుర్కొంటున్న వేళ నరేంద్ర మోడీ క్యాంపస్ ని ప్రారంభించడం బిజెపికి ఊరట కలగనుంది అసలే వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన తో పొత్తు పెట్టుకుని జనంలోకి వెళ్లడానికి బిజెపి సిద్ధం అయ్యింది. ఇప్పుడు ఎన్నికలు దగ్గర పడుతున్నాయి దీంతో పార్టీ ప్రచారాన్ని జోరుగా మొదలు పెట్టేసాయి. టీడీపీ, జనసేన, బిజెపి కలిసి ఎన్నికల్లో ఈసారి పోటీ చేయబోతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో బిజెపి ఇలా చేయడం బిజెపికి కాస్త ఊరట ని కలిగిస్తుంది. ఎన్నికల్లో టిడిపి జనసేన తో పొత్తు పెట్టుకుని జనంలోకి బిజెపి వెళ్తోంది సో ఇప్పుడు మోడీ తీసుకున్న స్టెప్ బిజెపికి బెనిఫిట్ కలిగిస్తుంది.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!