జబర్దస్త్ జడ్జిగా ప్రేక్షకులను నవ్విస్తూనే రాజకీయనాయకురాలి రోజా ఫైర్ బ్రాండ్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. నగరి ఎమ్మెల్యేగా ఉన్న రోజా సేవా కార్యక్రమాలు చేస్తూ కూడా ఎంతో మందికి అండగా నిలుస్తున్నారు. తాజాగా ఓ బాలుడికి రోజా భారీ సాయం చేశారు. పుత్తూరు లోని కల్యాణపురానికి చెందిన బాలుడు హర్షవర్దన్ తల్లి దండ్రులు ఇటీవల కరోనా కారణంగా మరణించారు. దాంతో బాలుడు అనాథగా మారాడు. అయితే తాజాగా అతడి పరిస్థితి తెలియడంతో రోజా ప్రభుత్వం తరపున రూ.10లక్షల ఎక్స్ గ్రేషియాను ఇప్పించారు.
Advertisement
Advertisement
దానికి సంబంధించిన చెక్ ను నేడు రోజా అందించారు. అంతే కాకుండా ఈ డబ్బును బాలుడి పేరిట ఫిక్స్డ్ డిపాజిట్ చేయించారు. బాలుడికి 25 ఏళ్ల వచ్చిన తరవాత అమౌంట్ మెచ్యూర్ అవుతుందని అప్పుడు డ్రా చేసుకోవచ్చని తెలిపారు. అంతే కాకుండా బాలుడి చదువు బాధ్యత తాను చూసుకుంటానని మాటిచ్చారు. ఇతర ఖర్చులను కూడా తానే భరిస్తానని రోజా హామీ ఇచ్చారు. ఇదిలా ఉంటే గతంలో కూడా రోజా అనేక సేవాకార్యక్రమాలు నిర్వహించిన సంగతి తెలిసిందే.