తెలుగు ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్న సినిమా ఆర్ఆర్ఆర్. ఇద్దరు స్టార్ హీరోలు..స్టార్ దర్శకుడు..పాన్ ఇండియా కథ..బాలీవుడ్ నటీనటులు.. ఇలా ఒక్కొటి సినిమాపై భారీ అంచానాలను పెంచేశాయి. ఇప్పటికే ఈ సినిమా టీజర్ మరియు ట్రైలర్ ను విడుదల చేయగా ఆ అంచనాలు రెట్టింపు అయ్యాయి. నిజానికి సినిమా ఇప్పటికే విడుదల కావాల్సింది. కానీ కరోనా పరిస్థితుల వల్ల సంక్రాంతికి రావాల్సిన ఈ చిత్రం మార్చి 25కు వాయిదా పడింది.
Advertisement
ఇక సినిమా విడుదల దగ్గర పడుతున్న నేపథ్యంలో చిత్ర యూనిట్ సినిమా నుండి ఎత్తర జెండా అంటూ టైటిల్ సాంగ్ ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ పాటలో రామ్ చరణ్ ఎన్టీఆర్ తో పాటూ అలియా భట్ స్టెప్పులు వేశారు. ప్రస్తుతం ఈ పాట యూట్యూబ్ లో ట్రెండింగ్ లో కనిపిస్తోంది. ఇప్పటికే ఈ పాటకు మిలియన్స్ కొద్ది వ్యూవ్స్ వచ్చాయి.
Advertisement
అంతే కాకుండా ఈ పాట విడుదల చేయడంతో సినిమా క్లైమాక్స్ లో హీరోలు ఇద్దరూ బ్రతికే ఉంటారని కూడా క్లారిటీ వచ్చేసింది. ఇదిలా ఉంటే ఈ సినిమా పాటలో పలువురు స్వాతంత్య్ర సమరయోధులను చూపించిన సంగతి తెలిసిందే. వారి గొప్పతనాన్ని చెబుతూ పాటలో వారిని చూపించారు కూడా..అలా భగత్ సింగ్, టంగుటూరి ప్రకాశం పంతులు, నేతాజీ సుభాష్ చంద్రబోస్, జాన్సీలక్ష్మీరాణీ, ఛత్రపతి శివాజీ ల ఫోటోలను చూపించారు.
ALSO READ : మేనేజర్ చేతిలో దారుణంగా మోసపోయిన తమన్నా…ఏం జరిగిందంటే..!
కానీ ఈ పాటలో జాతిపిత మహాత్మా గాంధీజీని మాత్రం చూపించలేదు. దాంతో గాంధీజిని ఎందుకు పాటలో చూపించలేదు అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. జక్కన్న గాంధీని కావాలనే చూపించలేదా..లేదంటే చూపించడం మర్చిపోయారా అని నెటిజన్లు చర్చించుకుంటున్నారు.