ఒకప్పుడు సినిమా వచ్చిందంటే చూశామా ఎంజాయ్ చేశామా అన్నట్టు ఉండేది. సినిమా వినోదాన్ని పంచితే చాలు తాము పెట్టిన టికెట్ డబ్బులకు న్యాయం జరిగిందని సంతోషపడేవారు. కానీ ఇప్పుడు కొత్తగా సినిమాల్లోని లాజిక్ లు మిస్టేక్ లను ప్రేక్షకులు గమనిస్తున్నారు. దానికి కారణం సోషల్ మీడియా ప్రభావమే అని చెప్పాలి. సినిమాలో ఏ చిన్న మిస్టేక్ జరిగినా లేదంటే సీన్లలో లాజిక్ లు మిస్సైనా నెటిజన్లు మరియు ట్రోల్స్ ట్రోల్స్ చూస్తుంటారు.
ఇక ఇప్పుడు సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా నటించిన సర్కారు వారి పాట సినిమాకు కూడా ఆ తిప్పలు తప్పడం లేదు. సర్కారు వారి పాట సినిమాకు పరషురామ్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోగా నటించింది. సినిమాలో మహేశ్ బాబు అమెరికాలో వడ్డీ వ్యాపారం చేసే రోల్ లో నటించాడు. అయితే సినిమాలో మొదట కీర్తి సురేశ్ జల్సాల కోసం ఎక్కువగా డబ్బులు ఖర్చు చేస్తు ఉంటుంది. ఈ నేపథ్యంలో మహేశ్ బాబు వద్దకు అప్పు కోసం వెళుతుంది.
Advertisement
Advertisement
మొదటగా మహేశ్ బాబు వద్ద పదివేల డాలర్లను అప్పు తీసుకుంటుంది. ఇక ఆ తరవాత మరోసారి మహేశ్ బాబు వద్దకు వెళుతుంది. ఈ సారి కీర్తి సురేష్ 15వేల డాలర్లను అప్పుగా తీసుకుంది. అయితే మొదటి సారి అప్పుకోసం వచ్చినప్పుడే మహేశ్ బాబు కీర్తి సురేష్ కు పడిపోతాడు. ఇదిలా ఉంటే కీర్తి చేసిన మోసం తెలిసి తన డబ్బులు రికవరీ కోసం వెళతాడు. కానీ ఇచ్చింది మొత్తం 25వేల డాలర్లు అయితే కేవలం 10 వేల డాలర్లను మాత్రమే అడుగుతాడు. మరో 15వేల డాలర్ల గురించి అడగడు. ఈ సినిమా చూసిన నెటిజన్లు మిస్టేక్ ను గుర్తించారు.
దాంతో డైరెక్టర్ ఈ లాజిక్ ఎలా మిస్సయ్యారు. ఇది చాలా పెద్ద మిస్టేక్ అంటూ ట్రోల్స్ చేశారు. ఇక ట్రోల్స్ ఎక్కువ అవ్వడంతో దర్శకుడు పరషురామ్ తాజాగా స్పందించారు. మహేశ్ బాబు ప్రేమలో పడకముందు 10వేల డాలర్లు ఇస్తాడు. ప్రేమలో పడిన తరవాత 15వేల డాలర్లు ఇస్తాడు కాబట్టి తన ప్రేమ కోసం వదిలేస్తాడు అంటూ చెప్పుకొచ్చాడు. అయితే దీనిపై కూడా నెటిజన్లు భలే కవరింగ్ అంటూ కామెంట్లు పెడుతున్నారు.
also read :
‘సర్కారు వారి పాట’ సినిమా లో లాజిక్ కోసం అడిగే వాళ్ళకి డైరెక్టర్ ఇచ్చిన సమాధానం అదుర్స్ !