నాగార్జున నాగచైతన్య హీరోలుగా తెరకెక్కిన మల్టీస్టారర్ సినిమా బంగార్రాజు. ఈ సినిమాకు కల్యాణ్ కృష్ణ దర్శకత్వం వహించారు. ఈ సినిమాను సోగ్గాడే చిన్నినాయినా సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కింది. ఇక ఈ చిత్రంలో నాగార్జునకు జోడీగా రమ్యకృష్ణ నటించగా నాగచైతన్యకు జోడీగా కృతిశెట్టి హీరోయిన్ గా నటించింది. అంతే కాకుండా సినిమాలో చైతూకు నాగార్జున తండ్రి మరియు తాతగా నటించాడు. ఇక కరోనా ఆంక్షల మధ్య విడుదలయినప్పటికీ ఈ సినిమాకు బ్లాక్ బస్టర్ టాక్ వచ్చింది.
Advertisement
ఏపీ తెలంగాణలో కూడా ఈ సినిమాకు మంచి కలెక్షన్స్ వచ్చాయి. ఎంతో కలర్ ఫుల్ గా తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను ఎంతగానో అలరించింది. ఇదిలా ఉండగా ఈ సినిమాలో దర్శకుడు ఓ బ్లండర్ మిస్టేక్ చేశాడు. ప్రేక్షకులు అంతగా పట్టించుకుంటారో లేదో అనుకున్నాడో ఏమో గానీ ఓ సీన్ మాత్రం లాజిక్ లేకుండా తీశాడు.
Advertisement
ఇక అసలే ఇది సోషల్ మీడియా యుగం కాబట్టి చిన్న మిస్టేక్ దొరికినా నెట్టింట ట్రోల్స్ బారిన పడాల్సి వస్తోంది. ఇక బంగార్రాజు దర్శకుడు ఏం మిస్టేక్ చేశాడో ఇప్పుడు చూద్దాం. సోగ్గాడే చిన్నినాయనా సినిమాలో బంగార్రాజు ఓ ఎద్దును పెంచుకుంటాడు. ఆ ఎద్దు పేరు బసవ.
అయితే బంగార్రాజు సోగ్గాడే చిన్నినాయినా ప్రారంభంలోనే చనిపోతాడు. కానీ బంగార్రాజు సినిమాలో కూడా బసవ అనే ఎద్దు కనిపించడమే కాకుండా ఆత్మ రూపంలో వచ్చిన బంగార్రాజును గుర్తు పడుతుంది. అయితే ప్రాక్టికల్ గా చూస్తే ఎద్దు జీవితకాలం 20 ఏళ్లు మాత్రమే కానీ సినిమాలో 50 ఏళ్ల తరవాత కథలో కూడా బంగార్రాజు పిలవగానే ఎద్దును చూపిస్తారు. ఇక ఈ పాయింట్ ను పట్టుకున్న నెటిజన్లు ట్రోల్స్ చేస్తున్నారు.