Home » ఆదిపురుష్ ట్రైలర్ లో ఈ మిస్టేక్ గమనించారా…? ఏంది సామీ ఇది అంటూ డైరక్టర్ పై దారుణమైన ట్రోల్స్..!

ఆదిపురుష్ ట్రైలర్ లో ఈ మిస్టేక్ గమనించారా…? ఏంది సామీ ఇది అంటూ డైరక్టర్ పై దారుణమైన ట్రోల్స్..!

by AJAY

సినిమా తీసేటప్పుడు కొత్త కథను తెరకెక్కిస్తే పెద్దగా జాగ్రత్త పడాల్సిన అవసరం లేదు. కానీ ఒక బయోపిక్ తీసేటప్పుడు లేదంటే పురాణాలు ఇతిహాసాల ఆధారంగా సినిమా తీసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. కాస్త తేడా కొట్టినా ట్రోల్స్ తప్పవు. ఇప్పుడు ఆదిపురుష్ విషయంలో అదే జరుగుతోంది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా బాలీవుడ్ దర్శకుడు ఓమ్ రౌత్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ఆది పురుష్.

ఈ సినిమా జూన్ 16న విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమా టీజర్ ప్రేక్షకులను నిరాశపరిచింది. టీజర్ లో గ్రాఫిక్స్ చాలా వీక్ గా ఉండడంతో ప్రేక్షకులు డిసప్పాయింట్ అయ్యారు… సినిమాపై ట్రోల్స్ చేశారు. కానీ ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. అయినప్పటికీ ట్రైలర్ లోను కొన్ని తప్పులు ఉన్నాయి. దాంతో ఆది పురుష్ కు ట్రోల్స్ తప్పడం లేదు. తాజాగా మరోసారి దర్శకుడు ఓమ్ రౌత్ పై ట్రోల్స్ రావడానికి కారణం ట్రైలర్ లో ఓ మిస్టేక్ ఉండటమే.

సాధారణంగా రామాయణంలో రాముడు ఇంట్లో లేనప్పుడు రావణుడు వచ్చి సీతను ఎత్తుకెళ్తాడు. అయితే రావణుడు బిచ్చగాడి వేషంలో సీత దగ్గరకు వస్తాడు. అంతేకాకుండా ….మాత భిక్షాందేహి… అని అడిగినప్పుడు గీత దాటి బిక్షం వేయాలని అంటాడు. సీత కూడా అలానే చేస్తుంది. ఆ తర్వాత మత్తుమందు ఇచ్చి సీత నిలబడ్డ స్థానం నుండి భూమిని ఎత్తుకెళ్తాడు.

ఈ సన్నివేశం పర్ణశాల వద్ద జరుగుతుంది. గతంలో రామాయణం బేస్డ్ గా వచ్చిన సినిమాలన్నీ ఇలానే ఉన్నాయి. కానీ ఆది పురుష్ లో మాత్రం అలా చూపించలేదు. రావణుడు వచ్చి సీతను గాల్లో తీసుకువెళతాడు. దాంతో ఓమ్ ఏంటి స్వామి ఇది…. రామాయణం గురించి పూర్తిగా తెలుసుకోకుండా సినిమా తీశావా అంటూ నెటిజన్స్ ఫైర్ అవుతున్నారు.

మరిన్ని తెలుగు సినిమా వార్తల కోసం ఇక్కడ చదవండి

Visitors Are Also Reading