భారత్ కు చెందిన హర్నాజ్ కౌర్ సంధు ఇజ్రాయేల్‌లో నిర్వహించిన మిస్ యూనివర్స్ పోటీల్లో విజేతగా నిలిచింది. 21 ఏండ్ల తరువాత భారత్ తరుపున మిస్ యూనివర్స్‌గా హర్నాజ్‌కౌర్ విజేతగా నిలిచింది. 21 ఏళ్ల తరువాత భారత్ తరుపున మిస్ యూనివర్స్‌గా హర్నాజ్‌కౌర్ ఎంపికవ్వడం విశేషం. మిస్ యూనివర్స్గా ఎంపికైన ఈ సుందరికీ ప్రశంసల వెల్లువ కొనసాగుతోంది. మోడలింగ్‌లో ఉంటూ తన అంద చందాలు, తెలివి తేటలతో ఆకట్టుకుని మిస్ యూనివర్స్ కి ఎంపిక కావడంతో ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఆమె పేరు మారు మ్రోగుతుంది.
Advertisement
సుస్మితాసేన్, లారాదత్తాల తరువాత ఈ ఘనతను సాధించిన అందాల తారగా నిలిచింది హర్నాజ్ కౌర్. ఇలా అందాల పోటీలో గెలిచి ఆ తరువాత సినిమాల్లో అవకాశాన్ని దక్కించుకున్న వాళ్లు చాలా మందే అని చెప్పాలి. ఉదాహరణకు ఐశ్వర్యరాయ్, ప్రియాంకా చోప్రా, మనుసి చిల్లర్, సుస్మితాసేన్ వంటి వారు మోడలిగ్ నుంచి వచ్చి ఆ తరువాత సినిమా పరిశ్రలోకి అడుగుపెట్టారు. ఇక ఇదే సమయంలో మిస్ యూనివర్స్గా ఎంపికైన హర్నాజ్ కౌర్ కు సైతం సినిమాల్లో అవకాశాలు వచ్చినట్టు తెలుస్తోంది.
Advertisement
పంజాబీ చిత్ర పరిశ్రమలోనికొందరు, దర్శక నిర్మాతలు ఆమెతో సినిమా చేసేందుకు పోటీ పడుతున్నారట. హర్నాజ్ కౌర్ ఇప్పటికే ‘బాయి జీ కుట్టంగే’ వంటి పంజాబీ మూవీకి సంతకం కూడా చేసిందట. ఈ సినిమాతో పాటు మరో చిత్రం చేయడానికి హర్నాజ్ కౌర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. ఇక అధికారిక ప్రకటన వచ్చేంత వరకు ఎదురు చూడాలి మరీ.