తెలుగు ఇండస్ట్రీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే తెలియని వారుండరు. ఆయన సినిమాల ద్వారా ఎంతో పేరు సంపాదించుకొని జనసేన పార్టీ ద్వారా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు.ప్రజలకి ఎలాగైనా దగ్గరవ్వాలని అధికార పార్టీ పై తీవ్రమైన విమర్శలు చేస్తూ తప్పులను ఎత్తి చూపుతున్నారు.. ఈ తరుణంలో అధికార పార్టీ మినిస్టర్ రోజా పవన్ కళ్యాణ్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు.. అవేంటో ఇప్పుడు చూద్దాం.. పవన్ కళ్యాణ్ నీకు రాష్ట్రంలో 175 స్థానాల్లో పోటీ చేసే దమ్ము ఉందా అంటూ సవాల్ విసిరారు. ఈ స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులే లేరు. కానీ అసెంబ్లీ లో జెండా ఎగర వేస్తారట అంటూ ఎద్దేవా చేశారు రోజా. ముందు గ్రామాల్లో సర్పంచ్ గా గెలవండి తర్వాత ఎమ్మెల్యేల గురించి ఆలోచించండి అంటూ అన్నారు. ప్యాకేజీలు తీసుకుంటూ వేరే పార్టీకి ఓటు వేయాలని పవన్ కళ్యాణ్ చెబుతున్నారని కడిగిపారేశారు.
Advertisement
ALSO READ:కృష్ణం రాజు గురించి సంచలన విషయాలను చెప్పిన నటి ‘వాణి శ్రీ ‘
Advertisement
ఎన్టీఆర్, చిరంజీవి లాంటి వారు పార్టీ పెట్టి సింగిల్ గా పోటీ చేస్తే పవన్ కళ్యాణ్ మాత్రం పార్టీ పెట్టి ప్యాకేజీల కోసం ఆశ పడుతున్నారని ఎద్దేవా చేశారు. ప్యాకేజీ తీసుకోవడం కోసమే పవన్ పార్టీ పెట్టారని, చంద్రబాబు చెప్పినట్టు మాట్లాడతారని అన్నారు. కనీసం ఎమ్మెల్యేగా కూడా గెలవలేని పవన్ కళ్యాణ్ నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారని, సినిమాల పై పిచ్చి ఉన్న వాళ్ళే మీటింగ్ లకు వస్తున్నారని, పవన్ కు సింగిల్ గా పోటీ చేసే దమ్ము లేదని కడిగిపారేశారు మంత్రి రోజా. ఓటుకు నోటు కేసులో చంద్రబాబు ని పవన్ కళ్యాణ్ ని ఎందుకు ప్రశ్నించడం లేదని అడిగారు.
విభజన చట్టంలో ఆంధ్రప్రదేశ్ ఆస్తులపై పవన్ కళ్యాణ్ ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నలు సంధించారు. ఏపీ ప్రజలు మొత్తం జగన్మోహన్ రెడ్డి కి మద్దతుగా ఉన్నారని, స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు చూస్తే అర్థం కావడం లేదా అని చెప్పుకొచ్చారు. కనీసం ఎమ్మెల్యేగా కూడా గెలవలేని లోకేష్ ని మంత్రి చేశారని, ఆయన మంత్రి పదవి చేపట్టి ఏం చేశారని ప్రశ్నించారు. చంద్రబాబుకు అధికార దాహం ఎక్కువగా ఉంటుందని వ్యవసాయం దండగ అన్న వ్యక్తి అని తీవ్ర ఆరోపణలు చేశారు మంత్రి రోజా. మరి రోజా చేసిన వ్యాఖ్యలపై పవన్ కళ్యాణ్ ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.
ALSO READ: